Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 13 March 2025
webdunia

ఆర్కే బీచ్‌కు నేను వెళ్తున్నా.. ఆగస్టులో వైకాపా ఎంపీలంతా రాజీనామా: జగన్ సంచలన ప్రకటన

ఏపీ ప్రత్యేక హోదాపై జల్లికట్టు తరహా ఉద్యమానికి రంగం సిద్ధమవుతోంది. యువత కదిలి రావాలని జనసేనాని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చిన నేపథ్యంలో.. ఏపీ ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా కూడా పవన్‌కు మద్దతిచ్చేందుకు సన్నద

Advertiesment
ఆర్కే బీచ్‌కు నేను వెళ్తున్నా.. ఆగస్టులో వైకాపా ఎంపీలంతా రాజీనామా: జగన్ సంచలన ప్రకటన
, బుధవారం, 25 జనవరి 2017 (12:28 IST)
ఏపీ ప్రత్యేక హోదాపై జల్లికట్టు తరహా ఉద్యమానికి రంగం సిద్ధమవుతోంది. యువత కదిలి రావాలని జనసేనాని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చిన నేపథ్యంలో.. ఏపీ ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా కూడా పవన్‌కు మద్దతిచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆర్కే బీచ్ పోరాటానికి సై అన్నారు. ఇప్పటికే ఆర్కే బీచ్‌కు వెళ్తే తాట తీస్తామని ఏపీ డీజీపీ వార్నింగ్ ఇచ్చారు. 
 
దీనిపై జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ, గురువారం (రిపబ్లిక్ డే) విశాఖపట్నంలో తలపెట్టిన క్యాండిల్ ర్యాలీకి తాను హాజరు కానున్నట్టు వైకాపా అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. శాంతియుతంగా తలపెట్టిన ర్యాలీని ఎలా అడ్డుకుంటారో చూస్తామని అన్నారు. "ర్యాలీలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేయాలని, పీడీ కేసులు పెట్టాలని మీరు నిర్ణయం తీసుకుంటే, అది మీ వ్యక్తిగత విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. నేనైతే అక్కడికి పోతున్నాను. కచ్చితంగా పోరాటంలో  పాల్గొంటున్నానని చంద్రబాబుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఇక తనను అరెస్ట్ చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టమన్నారు. 
 
ఇప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయమైతే, క్యాండిల్ లైట్ ర్యాలీలో పాల్గొనాలని జగన్ కోరారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఆయన కదలి రావాలని అన్నారు. ప్రత్యేక హోదా కావాలంటూ ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా, తాను మనస్ఫూర్తిగా మద్దతిస్తానని, అందరూ కలిస్తేనే, సునాయాసంగా హోదాను సాధించుకోగలుగుతామని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో అందరూ చంద్రబాబు నాయకత్వంలో ఢిల్లీకి వెళ్దామని అన్నారు. ఎంపీలతో రాజీనామాలు చేయించి, దేశం మొత్తం చూసేలా ఎన్నికలకు వెళ్దామన్నారు. 
 
మరోవైపు ఈ సంవత్సరం ఆగస్టులో వైకాపా ఎంపీలంతా రాజీనామా చేయనున్నారని వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి మూడేళ్ల సమయం ఇవ్వాలని తాము ముందుగానే నిర్ణయించామని తెలిపారు. మూడేళ్లు పూర్తయ్యే వరకు వేచి చూస్తామని, ఆ కాలపరిమితి మరో నాలుగు నెలల్లో ముగుస్తుందని, ఈలోగా హోదాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. 
 
రాష్ట్రానికి హోదా కోసం బడ్జెట్ సమావేశాల్లో ఒత్తిడి తెస్తామని, ఆపై వర్షాకాల సమావేశాల్లో బిల్లు తేకుంటే, రాజీనామా చేసి ప్రజల ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తమతో పాటు తెలుగుదేశం ఎంపీలూ రాజీనామా చేయాలని కోరారు. చంద్రబాబు సహకరిస్తే ఆనందిస్తామని, తోడు రాకపోయినా తమ పని తాము చేసుకుపోతామని జగన్ స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రత్యేకహోదా.. పవన్ కల్యాణ్‌కు సంపూర్ణ మద్దతిస్తా.. ఆర్కే బీచ్ ఆందోళనకు జై: నాగబాబు