Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దక్షిణాదిలో బీజేపీ ప్రచారాస్త్రంగా పవన్ కళ్యాణ్!

pawan - modi

ఠాగూర్

, గురువారం, 28 నవంబరు 2024 (11:41 IST)
జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై కమలనాథులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా, దక్షిణాదిలో ప్రచారాస్త్రంగా పవన్‌ను ఉపయోగించుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు. అందుకే హస్తిన పర్యటనలో పవన్‌కు కేంద్ర మంత్రులు పెద్ద పీట వేస్తూ రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. 
 
అదేసమయంలో జాతీయ స్థాయిలో కూడా పవన్ తన ప్రాధాన్యతను పెంచుకునేలా అడుగులు వేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం అధిక ప్రాధాన్యతను ఇచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. దీనికి నిదర్శనమే ఒక్క మంగళవారం రోజే వరుసగా ఏడుగురు కేంద్ర మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయాల్సిన సాయం, పెండింగ్ నిధులు, ఆర్థిక ప్రోత్సహకాలపై సుధీర్ఘంగా చర్చించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఇంతగా ప్రాధాన్యతను బీజేపీ ఈ మధ్యకాలంలో ఏ పార్టీ నేతలకు కూడా ఇవ్వలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో ప్రారంభమైంది. 
 
పార్లమెంట్ సమావేశాలు ఉన్న సమయంలో పవన్‌ను కేంద్ర మంత్రులు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికారు. పవన్ కల్యాణ్ కోరిన సాయాన్ని చేసేందుకు అందరూ సానుకూలంగా స్పందించారు. బుధవారం ప్రధాని మోడీని సైతం ప్రత్యేకంగా కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటు ఇద్దరు నేతలు సుధీర్ఘంగా చర్చించారు. తాజా రాజకీయాలు, కూటమి ప్రభుత్వం తీరు, మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంతో పాటు పలు అంశాలకు సంబంధించినవి ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. 
 
మాత్రం పవన్ కళ్యాణ్‌ను తమ గొంతుకగా చూస్తున్నదన్న ప్రచారం సైతం జోరుగా సాగుతోంది. కమలం నేతలు పవన్ కళ్యాణ్‌ను తమ దక్షిణాది నేతగా చూస్తున్నట్లుగా వెల్లడిస్తున్నారు. జనంలోకి హిందూత్వవాదాన్ని సైతం పవన్ ద్వారా తీసుకువెళ్లేందుకు సులువు అవుతుందన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ఏర్పడటానికి ప్రధాన కారణం పవన్ కావడంతో బీజేపీ సైతం అంతే ప్రాధాన్యతను కొనసాగిస్తూ వస్తుంది. హస్తినలో మాత్రం పవన్‌లో హవా పెరిగినట్లుగా మారింది. అలాగే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తోనూ పవన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారాహి డిక్లరేషన్‌ను అందించారు. ఇటు ఆర్ఎస్ఎస్‌లోనూ సఖ్యతతో పవన్ ముందుకు వెళ్తున్నారు. 
 
బీజేపీతో కలిసి ధృడబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కమలం పార్టీ రానున్న ఎన్నికల్లోనూ ఉపయోగించుకునేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కొద్ది నెలల్లో జరగనున్న ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పవన్ ప్రచారం చేయించనున్నారు. అలాగే దక్షిణాదిన నిలదొక్కుకునేలా బీజేపీ మొదటి నుంచి ప్రయత్నిస్తుంది. కానీ ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో ఎక్కడా మద్దతు లభించకపోవడంతో బీజేపీ ఉత్తరాది పార్టీ అనే ముద్రను వేసుకుంది. గత రెండు పర్యాయాలు కూడా దక్షిణాదిన బలపడేం దుకు బీజేపీ దృష్టిపెట్టినా ఆశించిన స్థాయిలో స్థానాలు దక్కలేదు. 
 
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో హిందూత్వంతో పాటు ఓబీసీ అస్త్రాన్ని బీజేపీ ప్రయోగిస్తూ, గెలుస్తూ వస్తుంది. హర్యానా, మహారాష్ట్రలోనూ ఇదే ప్లాన్ సక్సెస్ అయ్యింది. బలమైన బీసీ వాదాన్ని బీజేపీ ఎత్తుకుంటూ, ఆ నేతలను ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు పవన్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు తెలంగాణలో కూడా బలపడే అవకాశాలున్నట్లుగా అంచనా వేస్తున్నారు. అలాగే పవన్ ద్వారా ఇతర రాష్ట్రాల్లో కావాల్సిన ప్రచారం కూడా లభిస్తుందని ఆశిస్తున్నారు. పవన్‌ను ముందు ఉంచి బీజేపీ బలంగా తయారు అయ్యేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తుందన్న చర్చ హస్తిన వర్గాల్లో సాగుతోంది. ఊపిరి సలపనంత బిజీలోనూ సమయం ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్ఆర్ఆర్‌ను చంపేందుకు స్కెచ్ .. ఆ పెద్దలు ఎవరో తెలాలి?: రాజేంద్ర ప్రసాద్ (Video)