Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్ఆర్ఆర్‌ను చంపేందుకు స్కెచ్ .. ఆ పెద్దలు ఎవరో తెలాలి?: రాజేంద్ర ప్రసాద్ (Video)

raghurama krishnamraju

ఠాగూర్

, గురువారం, 28 నవంబరు 2024 (10:54 IST)
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును చంపేందుకు స్కెచ్ వేశారని ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ వి.రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. సీఐడీ ఆఫీస్ లోపలి నుంచి ఆయన నడవలేని స్థితిలో బయటకు వచ్చారని తెలిపారు. ఆర్ఆర్ఆర్‌ను వేధించిన వీడియోలను అధికారులు వైకాపా పెద్దలకు పంపారనీ, దాడి జరగలేదని నివేదిక ఇచ్చిన జీజీహెచ్ డాక్టర్లు కూడా ఈ కేసులో నిందితులే అని ఆయన పేర్కొన్నారు. 
 
గత వైకాపా ప్రభుత్వంలో రఘురామకృష్ణంరాజుపై రాజద్రోహం కేసు పెట్టి అరెస్టు చేసి చిత్ర హింసలకు గురిచేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో అప్పటి సీఐడీ ఏఎస్పీ విజయపాల్‌‍ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన వద్ద జరిపిన ప్రాథమిక విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఆయన 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
రఘురామను కస్టడీలో తీవ్రంగా వేధించారని చెప్పారు. సీఐడీ ఆఫీసుకు వెళ్లిన వ్యక్తి నడవలేని స్థితిలో బయటకు వచ్చారని వివరించారు. రఘురామను తాళ్లతో కట్టేసి కొట్టారని తెలిపారు. రఘురామను చంపడానికి కూడా ప్రయత్నించారని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. 
 
తనపై దాడి విషయాన్ని రఘురామకృష్ణంరాజు కోర్టుకు వివరించారని, నాడు తప్పుడు నివేదిక ఇచ్చిన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు కూడా నిందితులేనని చెప్పారు. మిలిటరీ ఆస్పత్రి నివేదిక ప్రకారకం రఘురామ శరీరంపై గాయాలు ఉన్నాయని వెల్లడించారు. రఘురామను వేధించడాన్ని వీడియో తీసి అప్పటి వైకాపా పెద్దలకు షేర్ చేశారని, ఇపుడు ఆ పెద్దలు ఎవరన్నది తేలాల్సి ఉందన్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్చ్.. నా పోస్టులు.. నా సినిమాలు ఒక్క ఓటరును ప్రభావితం చేయలేదు : ఆర్జీవీ (Video)