Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీశైలం సరే... నాగార్జున సాగర్ జలవిద్యుత్ కేంద్రం భద్రత ఏంటి?

Advertiesment
Nagarjuna Sagar Hydal Power Plant
, శనివారం, 22 ఆగస్టు 2020 (09:46 IST)
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పవర్ ప్యానెల్‌లో చెలరేగిన మంటలతో ఈ పెను విపత్తు సంభవించింది. ఫలితంగా 900 మెగావాట్లల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ పవర్ ప్లాంట్ మొత్తం దగ్ధమైపోయింది. శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో నాగార్జునసాగర్‌ జలవిద్యుత్తు కేంద్రం భద్రతపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంటోంది. ఇప్పటికే రెండుసార్లు ఇక్కడ షార్ట్‌సర్క్యూట్‌ కాగా, ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. 
 
శ్రీశైలం తరహా ప్రమాదమే నాగార్జునసాగర్‌ కేంద్రంలో జరిగితే ఆస్తి నష్టం అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2017 ఫిబ్రవరిలో, 2018 ఫిబ్రవరిలో షార్ట్‌ సర్క్యూట్‌తో టర్బైన్‌ కాలిపోయింది. 2014 ఓ టర్బైన్‌ పూర్తిగా కాలిపోయింది. సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. 
 
ఈ ప్లాంట్‌లో ప్రతి షిఫ్టులో డీఈ, ఏడీఈ, నలుగురు ఏఈలు, మరో నలుగురు సిబ్బంది విధులు నిర్వహిస్తారు. అనుకోని ప్రమాదం సంభవిస్తే.. ఉద్యోగులు తప్పించుకోవడానికి ఎమర్జెన్సీ గేట్లను ఏర్పాటు చేయాలి. అంబులెన్స్‌ ఉండాలి. ఇవేమీ లేకపోవడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని వారు ప్రాధేయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రాణాల కంటే పవర్ ప్లాంటే ముఖ్యమని భావించారా?