Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాన నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలే ఏకైక మార్గం... గుంత ఎలా తవ్వాలి?

మన ఇంటి ఆవరణలో ఉన్న బోరుబావికి సంవత్సరం అంతా నీరు పుష్కలంగా అందాలంటే... వాన నీటి ఇంకుడు గుంతలే ఏకైక మార్గం. ఇంకుడు గుంతలు తవ్వే విధానం ఏంటి...? 250 గజాల నుండి 500 గజాల స్థలములో ఉన్న ఇంటి ఆవరణలో 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవు, 8 అడుగుల లోతు ఉండేటట్ల

వాన నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలే ఏకైక మార్గం... గుంత ఎలా తవ్వాలి?
, సోమవారం, 2 మే 2016 (15:56 IST)
మన ఇంటి ఆవరణలో ఉన్న బోరుబావికి సంవత్సరం అంతా నీరు పుష్కలంగా అందాలంటే... వాన నీటి ఇంకుడు గుంతలే ఏకైక మార్గం. ఇంకుడు గుంతలు తవ్వే విధానం ఏంటి...?
250 గజాల నుండి 500 గజాల స్థలములో ఉన్న ఇంటి ఆవరణలో 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవు, 8 అడుగుల లోతు ఉండేటట్లుగా గుంట తీయాలి. గుంట లోపల నలువైపులా అడుగు భాగములో ఎక్కడా సిమెంట్ ప్లాస్టరింగ్  చేయకూడదు. మట్టి గుంటలో సగ భాగం అంటే 4 అడుగుల మేర 60mm లేదా 40mm గ్రానైట్ రాళ్ళు వేయాలి. వాటిపైన 2 అడుగుల మేర 20mm కంకర చిప్స్ వేయాలి. దానిపై 3 అంగుళాలు మాత్రమే బటాణ(గులక రాళ్ళు) లేదా దొడ్డు ఇసుక వేయాలి ఇలా చేయగా మిగిలిన 1. అంగుళాల గుంట లోపలి భాగమున మాత్రమే సిమెంట్ ప్లాస్టరింగ్ చేసుకోవాలి. 
 
ఆ తరువాత 1 అంగుళం ప్రదేశాన్ని ఖాళీగానే ఉంచాలి. గుంట చుట్టూ 9 అంగుళాల గోడ భూమి పైనుండి 6 అంగుళాలు లేదా 1 అడుగు పైకి కట్టుకోవాలి. ఆ తరువాత ఇంటి పైభాగం మీద పడే వాన నీరు ఇంకుడు గుంతలోనికి వచ్చే విధముగా 6 అంగుళాలు పైపును ఇంటి పైభాగం నుండి ఇంకుడు గుంట లోనికి ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధముగా నిర్మించిన ఇంకుడు గుంత ఎంత పెద్ద వాన కురిసిన ఆ నీటిని పీల్చుకోగలుగుతుంది.
 
గమనిక :-
* ప్రతి సంవత్సరం మే నెల 4వ వారం నుంచి ఇంటి పైభాగములో ఏ విధమైన చెత్త లేకుండా శుభ్రంగా వుంచుకోవాలి.
* ఇంకుడు గుంత లోపల ఎప్పుడూ చెత్త, కాగితాలు, ఆకులు, ప్లాస్టిక్ కవర్లు లేకుండా చూడాలి .
* ఇంకుడు గుంతలో పైన వున్న 3 అంగుళాల గులక రాళ్ళు లేదా ఇసుకను ప్రతి సంవత్సరం తీసి నీటిలో కడిగి మరల వాడితే ఎంత వర్షపు నీటిని అయినా ఇంకుడు గుంత నిమిషాలలో పీల్చుకోగలుగుతుంది. తద్వారా భూగర్భ జలాలు మనకు అందుబాటులో వుంటాయి. నీటి మట్టం బాగా పెరుగుతుంది.
 
వాస్తవాలు:-
* నగరములో కురిసే వర్షపు నీరు 92% వృధాగా పోతుంది.
* ఒక్క కుటుంబానికి 3 సంవత్సరాల అవసరానికి కావలసిన నీటిని ఒక్క వర్షా కాలములోనే సేకరించవచ్చు.
* ఇంటి నిర్మాణానికి ఎలాంటి నష్టం జరుగదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో డీజిల్ క్యాబ్స్ నిషేధం.. ఆందోళనకు దిగిన డ్రైవర్లు.. స్తంభించిన హస్తిన