Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Happy Teachers’ Day 2022: 21 ఏళ్లకే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ లెక్చరర్.. ఎవరాయన?

Radhakrishnan
, సోమవారం, 5 సెప్టెంబరు 2022 (09:30 IST)
మాతృదేవోభ‌వ‌.. పితృదేవోభ‌వ‌.. ఆచార్యదేవోభవ అంటారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రాధాన్యత గురువుకి ఇచ్చింది మన దేశం. గురువు అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు మాజీ రాష్ట్రపతి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌. సెప్టెంబర్ 5 ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తారు. 
 
దేశాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందని స్పష్టంగా చెప్పిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. విద్యపై అపారమైన నమ్మకం కలిగిన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ స్వయంగా అధ్యాపకుడు, దౌత్యవేత్త, పండితుడు, అలాగే రెండుసార్లు భారత ఉప రాష్ట్రపతిగా సేవలందించారు. 1952 నుంచి 1962 మధ్య ఉపరాష్ట్రపతిగా సేవలు అందించిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 1962 నుంచి 1967 వరకు రాష్ట్రపతిగా చేశారు.
 
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యాభ్యాసం 
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తిరుత్తణి గ్రామంలో 1888 సెప్టెంబరు 5న జన్మించారు. సాధారణ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన విద్యాభ్యాసం కోసం అనేక కష్టాలు పడ్డారు.  
 
తత్వశాస్త్రంపై మక్కువతో మాస్టర్స్ డిగ్రీలో ‘ది ఎథిక్స్ ఆఫ్ వేదాంత’ను థీసిస్‌గా ఎంపిక చేసుకుని 20వ ఏటనే థీసిస్ సమర్పించిన గొప్ప ప్రతిభాశాలి.
 
21 ఏళ్లకే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్చరర్‌గా చేరిన రాధాకృష్ణన్ మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనూ విధులు నిర్వహించారు.
 
రాధాకృష్ణన్‌ ఐదేళ్ల వయస్సులోనే తిరుత్తణిలో పాఠశాల విద్యాభ్యాసం ప్రారంభించారు. 
 
అనంతరం తిరుపతిలోని లూథరన్‌ మిషన్‌ హైస్కూ ల్‌లో సెకండరీ ఎడ్యుకేషన్‌ను అభ్యసించారు. 
 
ఆ తర్వాత వేలూరులోని వర్గీస్‌ కాలేజీలో ప్రీ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ రెండేళ్ల కోర్సు పూర్తిచేశారు. 
 
అనంతరం ఎఫ్‌ఏలో చేరారు. ఆ కోర్సును అభ్యసిస్తున్నప్పుడే పదిహేనేళ్ల వయస్సులోనే  శివకమ్మతో వివాహం జరిగింది. అనంతరం మద్రాసు క్రిస్టియన్‌ కళాశాలలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ కోర్సును పూర్తిచేసి 21 ఏళ్లకే మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. 
 
సర్వేపల్లి రాధాకృష్ణ విద్యాభ్యాసం, ఉద్యోగాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో ముడిపడి ఉంది. ఆయన బందరులో అధ్యాపకులుగా బాధ్యతలు నిర్వర్తించారు. రాధాకృష్ణన్‌ మేనత్త నెల్లూరులో ఉన్న టౌన్ హాల్ వీధిలో నివాసం ఉండేవారు. 
 
సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్‌రెడ్డిని ఒక వేదికపై సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అభినందించారు. 
 
ఈ సందర్భంగా ఒక చిత్రకారుడి చేతిలో రూపుదిద్దుకున్న తన చిత్రం వద్ద తెలుగులో సర్వేపల్లి రాధాకృష్ణయ్య అంటూ సంతకం చేసి మాతృభాషపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాపులపాలెంలో ఫైనాన్స్ వ్యాపారిపై అర్థరాత్రి కాల్పులు