Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూబ్లీహిల్స్‌లో ఇంద్రభవనం?.. హాట్ టాపిక్‌గా చంద్రబాబు కొత్త ఇల్లు నిర్మాణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ నగర నడిబొడ్డున కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. ఇది రహస్య భూతల స్వర్గంలా ఉందని విపక్ష వైకాపా నేతలు అంటున్నారు.

జూబ్లీహిల్స్‌లో ఇంద్రభవనం?.. హాట్ టాపిక్‌గా చంద్రబాబు కొత్త ఇల్లు నిర్మాణం
, శుక్రవారం, 14 ఏప్రియల్ 2017 (16:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ నగర నడిబొడ్డున కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. ఇది రహస్య భూతల స్వర్గంలా ఉందని విపక్ష వైకాపా నేతలు అంటున్నారు. ఇందుకోసం రూ.కోట్లు ఖర్చు చేశారని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ ఉద్యోగులందరినీ అమరావతికి తరలించిన సీఎం చంద్రబాబు తన ఇంటిని మాత్రం హైదరాబాద్‌లో కట్టుకోవడంతో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. 
 
హైదరాబాద్‌లోనే అతి ఖరీదైన జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 65లోని 1309, 1310 ప్లాట్ నంబర్లలో 2479 గజాల విస్తీర్ణంలో ఈ ఇంటి నిర్మాణం జరిగింది. ఈ ఇంటి నిర్మాణం కోసం ఉపయోగించిన ప్రతి వస్తువును విదేశాల నుంచి అంటే యూరప్, ఇటలీల నుంచి దిగుమతి చేయించుకున్నారని వారు చెపుతున్నారు. ఇందుకోసం చంద్రబాబు ఫ్యామిలీ యూరప్, ఇంటలీలకు మూడు సార్లు వెళ్లి వచ్చారట. 
 
ముఖ్యంగా గృహంలోని నిర్మాణాలు, కళాఖండాలు ఇంటీరియల్ డెకరేషన్స్ అన్నీ కళ్లు చెదిరేలా ఉన్నాయి. ప్రధానంగా కాన్ఫరెన్స్ హాల్స్, గ్రంథాలయం, వీఐపీ లాంజీలు, భోజనశాలలు, టెర్రస్‌పై‌ అరుదైన విదేశీ జాతి మొక్కలతో రూపొందించిన పచ్చికబయలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని ఈ ఇంటి గృహ ప్రవేశానికి వెళ్లివచ్చిన వారు చెపుతున్నారు. ఇంటిలోపల వినియోగించిన వస్తువులన్నీ దేశ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే కావడంతో ఈ భవనం ఇంద్రభవనాన్ని తలపిస్తోందని వారు అటున్నారు. 
 
ఇపుడు ఈ ఇంటి నిర్మాణంపై వైకాపా నేతలు తీవ్ర రాద్దాంతం చేస్తున్నారు. పదేళ్ళ ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను వీడి ఉద్యోగులంతా అమరావతికి వెళ్లి తీరాల్సిందేనంటూ చంద్రబాబు హుకుం జారీ చేశారని వారు గుర్తు చేస్తున్నారు. దీంతో ఇల్లూవాకిలి వదిలిపెట్టి ఉద్యోగులంతా అమరావతికి వచ్చారు. పైగా, అమరావతే తన కలల రాజాధాని అంటూ ఊకదంపుడు ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇపుడు కోట్లాది రూపాయల వ్యయంతో ఇంద్రభవనాన్ని నిర్మించుకున్నారని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్న పేదలకు ఒక్క ఇంటిని కూడా నిర్మించని చంద్రబాబు... ఆయన మాత్రం సరికొత్త ఇంటిని నిర్మించుకోవడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో చంద్రబాబు కొత్త ఇల్లు నిర్మాణం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీఎస్టీ చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం... ఈత గింజంత తాయిలం... తాటికాయంత బాదుడు