Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ అసెంబ్లీ నిర్మాణంలో ఎన్నెన్ని ప్రత్యేకతలో.. మైకు విరగ్గొట్టలేరు... పోడియం ఎక్కలేరు

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ (అసెంబ్లీ) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. విజయవాడ, గుంటూరు మధ్య ఉన్న వెలగపూడిలో అసెంబ్లీ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ భవన నిర్మాణంలో అధునాతన, అంతర్జాత

ఏపీ అసెంబ్లీ నిర్మాణంలో ఎన్నెన్ని ప్రత్యేకతలో.. మైకు విరగ్గొట్టలేరు... పోడియం ఎక్కలేరు
, శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (10:31 IST)
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ (అసెంబ్లీ) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. విజయవాడ, గుంటూరు మధ్య ఉన్న వెలగపూడిలో అసెంబ్లీ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ భవన నిర్మాణంలో అధునాతన, అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. 
 
అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతమైన వసతులు, కళ్లు చెదిరే హంగులతో ఆంధ్రపదేశ్‌ నూతన అసెంబ్లీ రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే శాసనసభ సభాపతి పోడియంతోపాటు, మండలి పోడియం, సీటింగ్‌ పనులు పూర్తి అయ్యాయి. ఇంటీరియర్‌ పనులు తుది దశలో ఉన్నాయి. 
 
ప్రధాని నరేంద్ర మోడీ చేత కొత్త అసెంబ్లీ ప్రారంభోత్సవం చేయించటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాగా ఈ నూతన శాసనసభలో అల్లరి చేసి, గోల చేద్దాం అనుకునేవారి ఆటలు సాగవు. ఆ దిశగా ఎన్నో ప్రత్యేకతలతో సభ్యులకు చిన్న అసౌకర్యం కూడా కలగకుండా ఉండేలా అసెంబ్లీ రెఢీ అవుతోంది.
 
ఈ భవన నిర్మాణం కోసం జర్మనీ నుంచి అత్యాధునిక పరికరాలు దిగుమతి చేశారు. మైకు, వాయిస్‌ రికార్డర్‌ కలిపి ఒకే పరికరంగా టేబుల్‌ లోపల అమర్చి ఉంటుంది. నోటికి వచ్చినట్టు మాట్లాడటం.. తర్వాత ‘మేము అనలేదు’ అని తప్పించుకోవటం కుదరదు. 
 
అలాగే, కోపం వచ్చే మైకులు విరగ్గొట్టలేరు. స్పీకర్‌ పోడియం పైకి ఎక్కడానికి వీల్లేదు. సభలో సభ్యుల మాటలు ప్రతిధ్వనించకుండా స్పష్టంగా వినిపించేలా అధునాతన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లోకేష్‌కు తెలంగాణ రాష్ట్ర బాధ్యతలా? ఎందుకు : టీటీడీపీ నేతలతో చంద్రబాబు