Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిన్నమ్మదంతా నాటకమే.. మీటింగ్‌కు వచ్చింది సగంమందే.. పట్టుబిగిస్తున్న పన్నీరు సెల్వం....

తమిళ రాజకీయాల్లో ఇప్పుడు హీరోగా మారిపోయారు పన్నీరుసెల్వం. ప్రతిపక్ష పార్టీలే కాదు సొంత పార్టీ నేతలే పన్నీరు సెల్వంను ఉత్సవ విగ్రహం అన్నా ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. తన పని తాను చేసుకు పోవడమే తెలిసింద

చిన్నమ్మదంతా నాటకమే.. మీటింగ్‌కు వచ్చింది సగంమందే.. పట్టుబిగిస్తున్న పన్నీరు సెల్వం....
, గురువారం, 9 ఫిబ్రవరి 2017 (14:11 IST)
తమిళ రాజకీయాల్లో ఇప్పుడు హీరోగా మారిపోయారు పన్నీరుసెల్వం. ప్రతిపక్ష పార్టీలే కాదు సొంత పార్టీ నేతలే పన్నీరు సెల్వంను ఉత్సవ విగ్రహం అన్నా ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. తన పని తాను చేసుకు పోవడమే తెలిసింది పన్నీరు సెల్వంకు. అమ్మ జయలలిత ఏది చెబితే అది చేస్తారు. కుర్చీలో కూర్చోమంటే కూర్చుంటారు.. లేవమంటే లేస్తారు. అది మాత్రమే ఆయనకు తెలిసింది. అందుకే ఆయన్ను తన్నీరు సెల్వం అని.. అలా ఎన్నో పేర్లను పెట్టారు నేతలు.
 
కానీ ప్రస్తుతం పన్నీరు సెల్వంకు ఆ పేర్లు లేవంటున్నారు ప్రతిపక్ష, అధికార పార్టీ నేతలు. అది నిజమైన హీరో అంటున్నారు. శశికళపై ఒక్కసారిగా తిరుగుబావుటా ఎగురవేసిన తర్వాత పన్నీరు సెల్వంలోని హీరోయిజం ఒక్కసారిగా బద్ధలైంది. అది కూడా శశికళ ప్రమాణ స్వీకారం ఆగిపోయిన తర్వాత పన్నీరు సెల్వం బయటకు వచ్చారు. తన వెంట కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిని నా వెంట తీసుకెళతానని ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా శశికళ వర్గీయుల్లో భయం పట్టుకుంది. శశికళే ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో 123 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని, అంతేకాదు నా వెనుక మొత్తం 131 ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకొచ్చారు. అందరూ అప్పుడు నమ్మేశారు. కారణం.. ఏ మీడియాను లోపలికి పంపురు కాబట్టి. దీంతో వారు చెప్పిందే కరెక్టని అందరూ వార్తలు ప్రసారం చేశారు. 
 
అయితే అదంతా అబద్దమని ఆ తరువాత తేలిపోయింది. శశికళ సమావేశానికి కేవలం 87మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారట. మిగిలిన వారు పార్టీ కార్యకర్తలట. కుర్చీలు ఖాళీగా ఉంటే వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి 123మంది ఎమ్మెల్యేలను శశికళ డ్రామా ప్లే చేసేశారట. దీన్ని బట్టి  శశికళకు ఎమ్మెల్యేల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. మిగిలిన ఎమ్మెల్యేలందరూ పన్నీరు సెల్వంకు బాసటగా నిలిచారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పన్నీరు సెల్వం ఇంటికి కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు వెళ్ళినా ఆయన వెంట చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట పడకూడదన్నదే వారి ఉద్దేశం.
 
అందుకేనేమో పన్నీరు సెల్వం నా సత్తా ఏంటో అసెంబ్లీలో చూపిస్తానని ప్రమాణం చేశాడు. అదే నిజమేమో... మసిపూసి మారేడు కాయ చేసిన శశికళ కన్నా ఏం చేయగలనో చెప్పిన పన్నీరు సెల్వమే గొప్పంటున్నారు ఆయన వర్గీయులు. అంతేకాదు ఇప్పుడు పన్నీరు సెల్వంకు తోడుగా డిఎంకే, జయలలిత మేనకోడలు దీప కూడా అండగా ఉన్నారు. అందుకే పన్నీరు సెల్వం తన విమర్శలకు మరింత పదును పెడుతున్నారు. శశికళ ప్రమాణ స్వీకారం చేయకుండా సుప్రీంకోర్టులో తీర్పు వచ్చి ఆమె దోషిగా నిరూపితమైతే తిరిగి పన్నీరు సెల్వం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయిపోనున్నారు. అనుకున్నది సాధిస్తారు పన్నీరు సెల్వం. ఇప్పుడు శశికళ కన్నా పన్నీరు సెల్వం చేస్తున్న రాజకీయాలే ఎక్కువగా తమిళ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.
 
మరోవైపు మధ్యాహ్నం తర్వాత ఇన్‌ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు తమిళనాడుకు రానున్నారు. తమిళనాడులో నెలకొన్ని శాంతిభద్రతల విషయంలో ఆయన పోలీసు ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. ఒక్క రాజకీయ పార్టీకి కూడా ఇప్పటి వరకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. బంతి మీద గవర్నర్ చేతిలోనే ఉంది. దీంతో విద్యాసాగర్ రావు ఏం చేస్తారన్నది ఆశక్తి కరంగా మారింది.
 
మరోవైపు విద్యాసాగర్ రావుకు నాలుగు ఆప్షన్‌లు ఉన్నాయి. 1. శశికళ చేత ప్రమాణ స్వీకారం చేయించడం, 2. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగడం 3. రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం 4. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా వినడం.. ఇలా చేయగలరంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఇందులో దేన్ని విద్యాసాగర్ రావు ఎంచుకుంటారో వేచి చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈసారి మంత్రి పదవి రాకుంటే తెదేపాకు రాం.. రాం...! ఎవరు..?