Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈసారి మంత్రి పదవి రాకుంటే తెదేపాకు రాం.. రాం...! ఎవరు..?

త్వరలో జరిగే ఏపీ కేబినెట్ మంత్రివర్గ విస్తరణలో ఎంతోమంది సీనియర్ నేతలు, బాబుకు అత్యంత సన్నిహితంగా వారు ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఎమ్మెల్సీలు ఇచ్చి.. తమకు మంత్రి పదవులు బాబు ఇచ్చేయడం ఖాయమని తమ సన్నిహితులత

Advertiesment
andhra pradesh cabient reshuffle
, గురువారం, 9 ఫిబ్రవరి 2017 (14:02 IST)
త్వరలో జరిగే ఏపీ కేబినెట్ మంత్రివర్గ విస్తరణలో ఎంతోమంది సీనియర్ నేతలు, బాబుకు అత్యంత సన్నిహితంగా వారు ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఎమ్మెల్సీలు ఇచ్చి.. తమకు మంత్రి పదవులు బాబు ఇచ్చేయడం ఖాయమని తమ సన్నిహితులతో చెప్పుకుంటున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఎంతోమంది సీనియర్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందులో ప్రధానంగా గాలి ముద్దుకృష్ణమనాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పయ్యావుల కేశవ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు.
 
వీరందరూ మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. తన కుమారుడి కోసం హడావిడిగా కేబినెట్‌ను విస్తరిస్తున్న చంద్రబాబునాయుడు మిగిలిన వారికి ఛాన్సులు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు. దీంతో సీనియర్లందరూ అమరావతి బాట పట్టారు. అమరావతిలో బాబు ఎక్కడ కనబడినా నమస్కారం పెట్టి తాము కూడా ఉన్నామని చెప్పుకుంటున్నారు. ఇదంతా బాబు గమనిస్తూనే ఉన్నారు.
 
అయితే ముందు నుంచి మంత్రి పదవి కోసం ఎగబడుతున్న వ్యక్తి చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత గాలిముద్దుక్రిష్ణమనాయుడు. ఈయన బాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయనకు మాత్రమే కాదు పార్టీలోనే సీనియర్ లీడర్. ఎన్ టి ఆర్ హయాంలోనే మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది. అయితే ముద్దుకృష్ణమనాయుడు దురదృష్టవశాత్తు సీనీనటి రోజా చేతిలో ఓడిపోయారు. అది కూడా తక్కువ మెజారిటీతోనే. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ ఎమ్మెల్యేగా ముద్దుకృష్ణమనాయుడు ఓడిపోవడంతో చివరకు నిరాశే మిగిలింది ముద్దు సన్నిహితులకు. 
 
ఓడిపోయినా మొదట్లోనే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారేమోనని అందరూ భావించారు. అయితే అప్పట్లో ముద్దుక్రిష్ణమనాయుడుకు ఇవ్వలేదు. దీంతో తరువాత తరువాత అనుకుంటూ వచ్చారు. చివరకు ఫిబ్రవరికి ముహూర్తం కుదిరింది. ఈసారి ఎలాగైనా సాధించుకోవాలని బాబు చుట్టూ ముద్దుక్రిష్ణమనాయుడు చక్కర్లు కొడుతూ ఉన్నారు. ఈసారి మంత్రి పదవి రాకుంటే మాత్రం వూరుకునేది లేదని, అవసరమైతే పార్టీని వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారట ముద్దుకృష్ణమనాయుడు. ఈ విషయాన్ని తన సన్నిహితులతోనే స్వయంగా చెప్పారట ఆయన. పార్టీకి ఎంతో సేవ చేసిన నన్ను ఆ పార్టీనే గుర్తించకపోతే ఎందుకంటున్నారు ముద్దుక్రిష్ణమనాయుడు. మరి చంద్రబాబు కేబినెట్ లో ముద్దుక్రిష్ణమనాయుడును తీసుకుంటారో లేదోనన్నది ప్రస్తుతం ఆశక్తికరంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్నమ్మ సీఎం అయితే జల్లికట్టు తరహా పోరాటానికి సై: విద్యార్థి సంఘాలు