Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చక్రం తిప్పుతున్న శశికళ.. ఆర్కేనగర్ ఎన్నికల్లో తంబిదురై పోటీ.. డిప్యూటీ స్పీకర్ పోస్టు గోవిందా?

అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ప్రస్తుతం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈమె తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పట

చక్రం తిప్పుతున్న శశికళ.. ఆర్కేనగర్ ఎన్నికల్లో తంబిదురై పోటీ.. డిప్యూటీ స్పీకర్ పోస్టు గోవిందా?
, బుధవారం, 4 జనవరి 2017 (16:13 IST)
అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ప్రస్తుతం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈమె తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ప్రస్తుత సీఎం పన్నీర్ సెల్వం పదవికి ఎసరుపెట్టడానికి సిద్ధమైన శశికళ.. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ మునిస్వామి తంబిదురైని టార్గెట్ చేశారు. ఎం.తంబిదురై అయిన ఈయనతో రాజీనామా చేయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 
 
కరూర్ నుంచి వరుసగా ఐదుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తంబిదురైకి కేంద్రంలో మంచి గుర్తింపు ఉంది. 2014 ఆగస్టు 12వ తేదిన తంబిదురై లోక్ సభ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత కేంద్రంతో తన సీటుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శశికళ చూసుకుంటున్నారు. 
 
అందుకే తంబిదురై చేత ఎంపీ పదవికి రాజీనామా చేయించి.. కరూర్ లోక్ సభ స్థానం నుంచి తన బంధువును గెలిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. శశికళ సీఎం కావాలని తంబిదురై తన లోక్ సభ డిప్యూటీ స్పీకర్ లెటర్ హెడ్‌లో ప్రకటన చేసి విమర్శలపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తంబిదురైకి తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పదవిని అంటగట్టి.. డిప్యూటీ స్పీకర్ పదవిని లాగేసుకోవాలని శశికళ ప్రయత్నాలు చేస్తోంది. 
 
అంతేగాకుండా.. జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్‌కే నగర్ ఉప ఎన్నికల్లో తంబిదురైతో పోటీ చేయించి ఎమ్మెల్యేగా గెలిపించి ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని శశికళ ప్రయత్నిస్తున్నారు. ఇందుకు తంబిదురైని ఒప్పించే పనిలో శశికళ సంప్రదింపులు జరుపుతున్నారు. కానీ తంబిదురై లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తంబిదురై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో? తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

50 ఏళ్ల వయస్సులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన జానెట్ జాక్సన్