Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#20yearsofWebdunia వెబ్‌దునియా తెలుగు యూట్యూబ్ ఛానల్‌కు ఆరేళ్లు

#20yearsofWebdunia వెబ్‌దునియా తెలుగు యూట్యూబ్ ఛానల్‌కు ఆరేళ్లు
, సోమవారం, 23 సెప్టెంబరు 2019 (18:46 IST)
సాధారణంగా వీడియోలను చూడటానికి, షేర్ చేయడానికి యూట్యూబ్‌ను ఉపయోగిస్తుంటాం. సామాజిక మాధ్యమాల్లో ఒకటైన యూట్యూబ్‌కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యూజర్లు కోకొల్లలు. సమాచారం అందించడానికి, ఇతరుల్లో స్ఫూర్తిని నింపేందుకు.. చిన్నాపెద్దా తేడాలేకుండా వాస్తవాలను తెలియజేసే పరికరంగా యూట్యూబ్ మారిపోయింది. 
 
యూట్యూబ్‌లో లేని అంశమంటూ లేదు. యూట్యూబ్ గురించి ఎవరికీ పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. మనందరం వినోదం కోసమో, విజ్ఞానం కోసమో, వంటల కోసమో యూట్యూబ్‌ను ఉపయోగిస్తూనే ఉన్నాం. అలాంటి వాటిల్లో ఒకటే వెబ్‌దునియా తెలుగు యూట్యూబ్ ఛానల్.
 
వెబ్‌దునియా తెలుగు 20వ ఏట అడుగుపెట్టింది. 20 ఏళ్ల వసంతాల్లో అడుగెట్టిన వెబ్‌దునియా తెలుగులో భాగమైన వెబ్‌దునియా తెలుగు యూట్యూబ్ ఛానల్‌ జూన్ 3, 2016 ప్రారంభమైంది. వెబ్‌దునియా తెలుగు యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపితమైన శుభదినం అదే. అప్పటి నుంచి వెబ్‌దునియా తెలుగు యూట్యూబ్ పేరిట రకరకాల, ఆసక్తికరమైన వీడియోలతో దూసుకుపోతోంది.

వార్తలు, సినిమా, క్రీడలు, ఆరోగ్యం, ఆధ్యాత్మికం, భవిష్యవాణి, వంటకాలు వంటి పలు రకాలైన వీడియోలను వెబ్‌దునియా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు, శ్రోతలకు అందిస్తోంది. ట్రెండింగ్ అంశాలను క్యాచ్ చేసుకుంటూ.. శ్రోతలకు, ప్రేక్షకులకు నచ్చే పలు అంశాలను వీడియోల రూపంలో అందిస్తోంది. ఆసక్తికరమైన వార్తలకు, క్రీడలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలను ఆడియో రూపంలో మీకు అందిస్తోంది. 
webdunia
ఆరంభం నుంచి ఇప్పటివరకు ఆరేళ్ల పాటు సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న వెబ్‌దునియా తెలుగు యూట్యూబ్ ఛానల్ అత్యధిక వీక్షకులు, సబ్‌స్క్రైబర్ల దిశగా పరుగులు తీస్తోంది. ఈ పరుగులో, ప్రయాణంలో వీక్షకులు, సబ్‌స్క్రైబర్ల ఆదరణ మరింత లభించాలని కోరుకుంటూ.. వెబ్‌దునియా తెలుగు యూట్యూబ్ ఛానల్‌ను ఆదరిస్తున్న అభిమానులకు, శ్రోతలకు, వీక్షకులకు, సబ్‌స్క్రైబర్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపి రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ ఛైర్మన్‌గా జస్టిస్ రాజా ఇళంగో బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ‌