Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తాడిపత్రి రైల్వే గేట్ వద్ద పట్టాలపై హిజ్రా శవం... ముగ్గురు హిజ్రాల వద్ద విచారణ

Advertiesment
murder
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం రైల్వేగేట్ సమీపంలో రైలు పట్టాలపై ఓ హిజ్రా శవం కనిపించింది. ఇది స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కేసులో స్థానిక పోలీసులు ముగ్గురు హిజ్రాలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. తాడిపత్రికి చెందిన మల్లిక అనే హిజ్రా ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోయింది. ప్రత్యర్థి వర్గానికి చెందిన కొందరు ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఈ కిడ్నాప్ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదివారం రాత్రి చల్లవారిపల్లె రైల్వే గేట్ సమీపంలో పట్టాలపై మృతదేహం ఉన్నట్టు సమాచారం వచ్చింది. దీంతో అక్కడకు వెళ్లి చూడగా చనిపోయింది మల్లికగా గుర్తించారు. 
 
మల్లిక మరణ వార్త తెలియగానే తోటి హిజ్రాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రత్యర్థి గ్రూపువారే పథకం ప్రకారం మల్లికను కిడ్నాప్ చేసి హత్య చేశారంటూ వారు ఆరోపించారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన స్థానిక పోలీసులు.. శిరీష్, సంగీత, రాధ అనే ముగ్గురి హిజ్రాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హిజ్రా వర్గాల మధ్య ఉన్న గ్రూపు తగాదాలే ఈ హత్యకు కారణమా లేకా మరేదైనా కోణం ఉందా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బహ్రెయిన్‌లో నరసాపురం యువతి ఆత్మహత్య