Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏంటయ్యా ఇది..? పాఠశాల బాత్రూంలో సిగిరెట్లు తాగుతున్నాడని మందలిస్తే మాస్టారిపై దాడి

Advertiesment
teacher attacked by Student
teacher attacked by Student
గురువులంటే ఒకప్పుడు మర్యాద, గౌరవం వుండేది. ప్రస్తుతం గురువులను లెక్కచేయని చాలామంది విద్యార్థులు వున్నారనే చెప్పాలి. విద్యార్థుల బాగు కోరుకునే ఉపాధ్యాయులకు కొన్ని చేదు అనుభవాలను మిగులుస్తున్నారు చాలామంది. అలాంటి చేదు ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
పాఠశాల బాత్రూంలో సిగిరెట్లు తాగుతున్నారని మందలించిన నేరానికి ఓ మాస్టారిపై పదవ తరగతి విద్యార్థులు పిడిగుద్ధుల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, గన్నవరం నియోజకవర్గం పరిధిలోని బాపులపాడు మండలం, వీరవల్లి జడ్పీ హైస్కూల్లో ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. 
 
విద్యార్థుల దాడితో ఆ గురువు నొప్పికి తట్టుకోలేకపోయాడు. చెడు అలవాట్లకు దూరంగా వుండమని చెప్పినందుకు ఈ శిక్ష తప్పదా అన్నట్లు వాపోయాడు. ఉపాధ్యాయుడిపై దాడి చేస్తున్న విద్యార్థులను కొందరు అడ్డుకున్నా.. అప్పటికే ఆ టీచర్‌కు గాయాలు తప్పలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నారా దేవాన్ష్ ఈ తరం పిల్లలలాగా టెలివిజన్, ఫోన్లలో లేడు.. నారా లోకేష్