ఆంధ్రప్రదేశ్ మహిళా మంత్రి పీఎ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేసింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ... నా ఫ్రెండ్స్ నిన్ను ఇష్టపడుతున్నారు. ఒక గంటసేపు వచ్చి వెళ్లు. వాళ్ల కోర్కె తీర్చు అని మహిళామంత్రి పీఎ సతీష్ నాకు మెసేజ్ చేసాడు. నా భర్త 2021లో కరోనా వల్ల చనిపోయాడు. దాంతో నాకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చేట్లు చేస్తానని పీఎ సతీష్ నన్ను సంప్రదించాడు.
నా దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకున్నాడు. నగదు రూపేణా చాలా తీసుకున్నాడు. ఉద్యోగం కోసం డబ్బులు అడిగారా అని నేను అధికారులు అడిగితే వాళ్లు తమకేమీ తెలియదన్నారు. మొత్తం డబ్బును సతీష్ కాజేసాడు. అదేమని అడిగితే నన్ను బెదిరిస్తున్నాడు. ఈ విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళితే 30 మంది మధ్య నన్ను దూషించింది. నా పీఎపైనే నిందలు వేస్తావా అని వేరే చోటకి నన్ను ట్రాన్సఫర్ చేసారు. దానిపై నేను కోర్టుకు వెళ్లి గెలిచాను. అదంతా మనసులో పెట్టుకుని మంత్రి పీఎ నన్ను బెదిరిస్తూ, లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆమె ఆరోపించింది.