Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 30 April 2025
webdunia

న్యాయం చేయమని ఆశ్రయిస్తే ఇద్దరు వివాహితలను లొంగదీసుకున్న ఎ.ఎస్.ఐ, ఆ తరువాత..?

Advertiesment
police
, గురువారం, 10 మార్చి 2022 (20:05 IST)
అతను బాధ్యతాయుతమైన పోలీసు ఉద్యోగంలో ఉన్నాడు. మంచిచెడులను పదిమందికి చెప్పాల్సిన అతనే చెడు మార్గంలో నడిచాడు. పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఇద్దరు వివాహితలను లొంగదీసుకుని కోర్కెలు తీర్చుకుంటూ ఉండేవాడు. అయితే ఎఎస్ఐతో సహజీవనం చేస్తున్న ఇద్దరు వివాహితలు స్నేహితురాళ్లు కావడం కొసమెరుపు. చివరికి ఏమైందంటే..

 
కర్నూలు జిల్లా పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్నాడు ఫక్రుద్దీన్. ఎఎస్ఐగా విధులను నిర్వర్తిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం వివాహం జరిగి భర్తతో గొడవ కారణంగా పోలీసు స్టేషన్‌కు వచ్చింది సుమలత. న్యాయం చేయమని కోరింది.

 
సీన్‌లో ఫక్రుద్దీన్ ఉన్నాడు. న్యాయం చేస్తానన్నాడు. సుమలత  భర్తకు వార్నింగ్ ఇచ్చాడు. అతను మారకపోగా ఇంట్లో నుంచి పారిపోయాడు. దీంతో ఆమె ఒంటరిగా మారింది. అయితే ఫక్రుద్దీన్ సుమలతకు దగ్గరయ్యాడు. ఆమెతో సన్నిహితంగా మెలుగుతూ వివాహేతర సంబంధం పెట్టేసుకున్నాడు. 

 
ఇదిలా సాగుతుండగానే సుమలత స్నేహితురాలు సుజాత ఉంది. ఆమె వడ్డీ వ్యాపారం చేస్తూ ఉండేది. కొంతమంది తీసుకున్న డబ్బులు ఇవ్వలేదని.. తనకు సహాయం చేయాలని సుజాత, సుమలతను కోరింది.

 
దీంతో ఫక్రుద్దీన్‌ను పరిచయం చేసింది సుమలత. ఇంకేముంది సుజాతకు హెల్ప్ చేస్తూ ఆమెపై కూడా కన్నేసాడు ఎ.ఎస్.ఐ. ఒకరి విషయం మరొకరికి తెలియకుండా మేనేజ్ చేస్తూ వచ్చాడు. అయితే సుజాత దగ్గర సుమలత 8 లక్షల రూపాయల అప్పు తీసుకుంది.

 
డబ్బు విషయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అంతకుముందే ఫక్రుద్దీన్‌కు సుమలతకు మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఎఎస్ఐను ఆమె దూరం పెట్టింది. దీన్ని జీర్ణించుకోలేకపోయాడు. దీంతో పాటు సుజాతకు కూడా డబ్బులివ్వాల్సి ఉండటంతో ఆమెను రెచ్చగొట్టాడు.

 
సుమలత చంపేయమని ప్లాన్ ఇచ్చాడు. ఆధారాలు దొరక్కుండా చేసుకోవచ్చని చెప్పాడు. దీంతో సుజాత రామక్రిష్ణ అనే వ్యక్తి సహకారంతో సుమలతను దారుణంగా చంపేసారు. కానీ విచారణలో అసలు విషయం బయటపడింది. 
 
నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకోగా ఎఎస్ఐ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వివాహేతర సంబంధంతో సుమలతను హత్య చేయడంతో ఆమె పిల్లలు అనాధలుగా మారిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోవా అసెంబ్లీ ఎన్నికలు : స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో బీజేపీ ప్రభుత్వం