Publish Date: Sun, 12 Apr 2026 (10:15 IST)
Updated Date: Sun, 12 Apr 2026 (10:17 IST)
తన వద్ద చదువుకునే అభంశుభం తెలియని ఓ విద్యార్థినికి కామాంధ ఉపాధ్యాయుడు ఒకడు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఆ తర్వాత ప్రేమ పాఠాలు వర్ణించి, శారీరకంగా దగ్గరయ్యాడు. దీంతో ఆ బాలికను గర్భందాల్చడంతో ఎవరికీ తెలియకుండా అబార్షన్ చేయించాడు. అయితే, ఆ బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో చెళ్లకెర తాలూకా తళకు పోలీసులు గణిత ఉపాధ్యాయుడు హెచ్.ఒ.రాజణ్ణపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ సమీపంలో ఉన్న చెళ్లకెరలో జరిగింది.
చెళ్లకెర తాలూకా తళకు గణిత ఉపాధ్యాయుడుగా హెచ్.ఓ.రాజణ్ణ విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తన వద్ద చదువుకునే ఓ విద్యార్థినితో చనువు పెంచుకుని దగ్గరయ్యాడు. ఈ క్రమంలో గత 2025 ఆగస్టు 26న బాలికను తన పొలానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తరచూ బాలికపై అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది.
ఈ విషయం తెలియడంతో రాజణ్ణ ఈ ఏడాది ఫిబ్రవరి 25న చెళ్లకెరలోని వైద్యులు శంకరలక్ష్మీతో కలిసి బాలికకు గర్భస్రావం చేయించినట్లు అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయం తెలుసుకొన్న అధికారులు బాలికకు కౌన్సిలింగ్ నిర్వహించి వివరాలను ధ్రువీకరించుకొన్నారు. శుక్రవారం అధికారులు పోలీసు ఠాణాలో నిందితులపై ఫిర్యాదు చేశారు.
రాజణ్ణపై పోక్సో కేసు నమోదైన తర్వాత విషయం తెలుసుకొని పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు అతన్ని దావణగెరె ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం. కేసు విచారణలో ఉందని అధికారులు తెలిపారు. అలాగే, బాలికకు అబార్షన్ చేసిన వైద్యుడిపై కూడా కేసు నమోదైంది.