గుంటూరు జిల్లా తాడేపల్లిలో విషాదం చోటుచేసుకున్నది. 29 ఏళ్ల బ్రహ్మయ్య అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యతో వున్న గొడవలు కారణంగా అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు యువకుడి తల్లి చెబుతోంది.
పెళ్లి చూపులు జరిగిన మూడవ రోజే తన భర్త చనిపోయాడనీ, వద్దని చెప్పినా వినకుండా తన కొడుకు ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడని అంటోంది బ్రహ్మయ్య తల్లి. పెళ్లయి ఏడాది కూడా పూర్తి కాలేదనీ, పెళ్లయిన దగ్గర్నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే వున్నాయంటూ వెల్లడించింది. నా కోడలికి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం వున్నదనీ, దాంతో నా కొడుకు తీవ్రమైన బాధతో ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఆమె ఆరోపిస్తోంది.