ఈ కాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి. తాజాగా ఓ వ్యక్తి పొరుగింటి వ్యక్తిని అడ్డంగా మోసం చేశాడు. ఒక ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి వలె నటించి వడ్డీకి రుణం ఇస్తానని వాగ్ధానం చేసి తన పొరుగువారిని రూ. 2.65 లక్షల వరకు మోసం చేసినందుకు జుహు పోలీసులు ఒక వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. రిహాన్ నాగ్వేకర్ అనే వ్యక్తి ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు 2016లో డీహెచ్ఎఫ్ఎల్ బ్యాంక్ హోమ్ లోన్ నుండి రూ.19 లక్షల రుణం తీసుకున్నాడు. ఫిబ్రవరి 2022లో, అతని పొరుగువాడు, తనిల్ చిప్కర్ తన కార్యాలయానికి వెళ్లి, ఐడీఎఫ్‌సీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్లు నమ్మబలికాడు. చిప్కర్ నాగ్వేకర్‌కు తక్కువ వడ్డీ రేటుతో లోన్ తీసిస్తానని చెప్పాడు. అతని రుణాన్ని రూ.7 లక్షల అదనపు ప్రయోజనంతో ఐడీఎఫ్‌సీకి బదిలీ చేయమని ఒప్పించాడు. తన బ్యాంక్ 6.91% వడ్డీ రేటుతో రూ.26 లక్షలు అందజేస్తుందని నగ్వేకర్‌కు హామీ ఇచ్చారు.
చిప్కర్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ. 9,500ను అభ్యర్థించాడు. నాగ్వేకర్ దానిని వెంటనే బదిలీ చేశాడు. చిప్కర్ అప్పుడు దరఖాస్తు రుసుముగా రూ.6,500 అడిగాడు. దాని తర్వాత అతను బ్యాంకు లెటర్ హెడ్‌పై రూ.26 లక్షల రుణం మంజూరు చేసినట్లు సూచించే లేఖ కాపీని అందుకున్నాడు.
చిప్కర్ స్టాంప్ డ్యూటీ కోసం రూ.24,500 అభ్యర్థించాడు. ఇలా వివిధ బ్యాంకు సంబంధిత పనుల సాకుతో వివిధ మొత్తాలను సేకరించడం కొనసాగించాడు. మార్చి 2022లో, చిప్కర్ నాగ్వేకర్‌కి తన రుణం డబ్బు అతని బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని తెలియజేశాడు.
అయితే అతను ముందుగా ఈఎంఐగా రూ. 24,000 చెల్లించవలసి ఉంది. చాలా నెలలుగా, నాగ్వేకర్ చిప్కర్ ఖాతాకు రూ. 2,65,535 చెల్లించాడు. అయితే, ఆరు నుండి ఏడు నెలల తర్వాత కూడా అతని రుణం ఐడీఎఫ్‌సీకి బదిలీ కాకపోవడంతో.. అతను మోసపోయానని గ్రహించాడు. ఆపై చిప్కర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.