Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

Advertiesment
Lady don Zikra

ఐవీఆర్

, శుక్రవారం, 18 ఏప్రియల్ 2025 (21:40 IST)
ఫోటో కర్టెసి- సోషల్ మీడియా
లేడీ డాన్. నేరాల్లో చాలా అరుదుగా లేడీ డాన్లు పేర్లు వినబడుతుంటాయి. ఐతే గురువారం సాయంత్రం ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో 17 ఏళ్ల టీనేజ్ బాలుడు కునాల్ ఆహారం తెచ్చుకునేందుకు ఓ షాపుకి వెళ్లాడు. అతడు ఆహార పదార్థాలను కొనుగోలు చేస్తుండగా ఓ గ్యాంగ్ మారణాయుధాలతో అతడిపై కత్తులతో అత్యంత దారుణంగా పొడిచి పారిపోయింది. తీవ్ర కత్తిపోట్లకు గురైన బాధితుడిని ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో లేడీ డాన్ జిక్రా హస్తం వున్నట్లు ఆరోపణలు రావడంతో ఆమెను అరెస్ట్ చేసారు.
 
లేడీ డాన్ జిక్రా ఎవరు?
ఢిల్లీలోని సీలంపూర్‌కు చెందిన యువతి జిక్రా. ఈమె గతంలో గ్యాంగ్‌స్టర్ హషీమ్ బాబా భార్య జోయాకు బౌన్సరుగా పనిచేసేది. మాదక ద్రవ్యాల కేసులో జోయాను పోలీసులు అరెస్ట్ చేయడంతో జిక్రా తన సొంత గ్యాంగును ఏర్పాటు చేసుకున్నది. ఈ గ్యాంగులో 12 మంది దాకా సభ్యులుండేవారు. ఆమధ్య తన చేతిలో తుపాకి పట్టుకుని వున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆమెను అరెస్ట్ చేసారు. 15 రోజుల కిందట బెయిల్ పైన బైటకు వచ్చింది. ఈ క్రమంలో మృతుడు కునాల్ ఇంటికి సమీపంలో అద్దెకి దిగింది.
 
ఆమెను, ఆమె గ్యాంగ్‌ను చూసి భయపడిపోయిన కొంతమంది అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు వాదనలు కూడా వున్నాయి. మరోవైపు తన సోదరుడు వరసైన సాహిల్ పైన ఇటీవలే హత్యాయత్నం జరిగింది. ఈ కుట్రలో కునాల్ హస్తం వున్నదన్న అనుమానంతో అతడిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు లోతుగా జరుపుతున్నట్లు పోలీసులు తెలియజేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?