Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్నేహితుడితో కలిసి స్కూల్‌కు తీసుకెళ్లే ఆటో డ్రైవర్ అత్యాచారం... బిడ్డకు జన్మనిచ్చిన బాలిక

Advertiesment
rape
ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. తన స్నేహితుడితో కలిసి పాఠశాలకు సుకెళ్లే ఆటో డ్రైవర్ ఒకరు 14 యేళ్ల బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చి, పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నూలు నగర శివారు గ్రామానికి చెందిన ఓ బాలిక రోజూ ఆటోలో పాఠశాలకు వెళ్లేది, ఆటో డ్రైవర్ బోయ మహేంద్ర ఆ బాలికపై కన్నేశాడు. తర్వాత మాయ మాటల చెప్పి ఆ బాలికను లోబరుచుకుని తన స్నేహితుడైన ట్రాక్టర్ డ్రైవర్ తెలుగు శివకుమార్‌తో కలిసి లైంగికదాడికి పాల్పడ్డాడు. పైగా ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని హెచ్చరించడంతో ఆ బాలిక భయపడిపోయి మిన్నకుండిపోయింది. ఇదే అదునుగా భావించిన కామాంధులు.. ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి తెగబడ్డారు. ఈ క్రమంలో ఆ బాలిక గర్భందాల్చింది. 
 
అయితే, ఆ బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఈ నెల 28వ తేదీన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి గర్భవతి అని తేల్చారు. పైగా, అదే రోజు ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. మైనర్ బాలిక ప్రసవించడంతో వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు. 
 
ప్రస్తుతం ఆ బాలిక, పసికందు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారుల సమక్షంలో ఉన్నారు. నిందితుల నుంచి ప్రాణహాని ఉందని బాధితురాలి కుటుంబం చెబుతుంటే.. పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చబుతున్నారు. మరోవైపు, ఈ ఘటనపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇరాన్‌కు భయపడిన గల్ఫ్ దేశాలు.. డబ్బులిచ్చి అమెరికాతో యుద్ధమా?