Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పండగ నాడు భార్యను పరిచయం చేసి భోజనం పెట్టించాడు, అంతే... ఆమెను లొంగదీసుకుని...

Advertiesment
illicit affair
, మంగళవారం, 25 జనవరి 2022 (22:19 IST)
స్నేహితుడిని నమ్మాడు. ఇంటికి తీసుకొచ్చాడు. భార్యకు పరిచయం చేశాడు. అదే అతను చేసిన తప్పని ఆ తరువాత తెలుసుకున్నాడు. తన భార్యను స్నేహితుడు వలలో వేసుకుంటాడని అస్సలు అనుకోలేదు. స్నేహితుడే తన జీవితాన్ని నాశనం చేస్తాడని కలలో కూడా ఊహించలేదు. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశంగా మారుతోంది.

 
చిక్ బళ్ళాపురంజిల్లా గౌరీబిదనూర్ తాలూకా కంబలహళ్ళి అనే గ్రామంలో శంకర్ అనే 30 యేళ్ళ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రెండురోజుల క్రితం జరిగిన ఈ హత్యకు సంబంధించి అతని స్నేహితుడే నిందితుడుగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే...

 
అశోక్, శంకర్‌లు మంచి స్నేహితులు. ఇద్దరూ లారీ డ్రైవర్లే. అశోక్‌కు వివాహమైంది. శంకర్‌కు ఇంకా వివాహం కాలేదు. అశోక్ ఇంటికి శంకర్‌ను తీసుకెళ్ళి పండుగరోజు భోజనం పెట్టాడు. అదే అతను చేసిన తప్పని ఆ తరువాత తెలుసుకున్నాడు. అశోక్ భార్య పద్మను శంకర్‌కు పరిచయం చేశాడు.

 
ఎంతో అందంగా ఉన్న పద్మను చూసి శంకర్ ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలనుకున్నాడు. ఎలాగోలా ఆమె ఫోన్ నెంబర్‌ను సేకరించి మెల్లగా మాటల్లో దింపాడు. ఇంకేముంది భర్తను మోసం చేసిన ఆ భార్య శంకర్‌కు బాగా దగ్గరైంది. శారీరకంగా ఇద్దరూ కలిసేవారు. 

 
తను లేని సమయంలో శంకర్ ఇంటికి వచ్చి వెళుతున్న విషయాన్ని పక్కింటి వాళ్ళ ద్వారా తెలుసుకున్నాడు అశోక్. ఎలాగైనా స్నేహితుడిని చంపేయాలనుకున్నాడు. వీరిద్దరి మధ్యా వివాహేతర సంబంధం తెలియనట్లుగానే నటించిన అశోక్, శంకర్‌ను తీసుకుని మద్యం పార్టీకి వెళ్ళాడు.

 
ఆదివారం రాత్రి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయే విధంగా మద్యం సేవించేట్లు శంకర్‌ను చేసాడు. ఆ తర్వాత బండరాయితో కొట్టి చంపేశాడు. అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు. సోమవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు వేలిముద్రల ఆధారంగా స్నేహితుడే కారణమని నిర్థారించుకుని అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పద్మ పురస్కారాలకు ఎంపికైనవారికి అభినందనలు: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్