Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీ ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య...

Advertiesment
suicide

ఠాగూర్

, శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (13:18 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఐఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు వరుసగా జరుగుతున్నాయి. ఈ విషాదకర ఘటన స్థానికంగా కలకలం రేపుతున్నాయి. తాజాగా ఐఐటీ ఢిల్లీలో ఓ విద్యార్థి చనిపోయాడు. మహారాష్ట్రలోని నాశిక్‌కు చెందిన నెర్కర్ (24) అనే విద్యార్థి ఎంటెక్ చదువుతున్నాడు. క్యాంపస్‌లోని ద్రోణాచర్య వసతి గృహంలో అతడి మృతదేహం శుక్రవారం వేలాడుతూ కనిపించింది. నెర్కర్ ఆత్మహత్య చేసుకునివున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
పోలీసుల సమాచారం మేరకు.. కుటుంబ సభ్యులు గురువారం రాత్రి ఫోన్ చేయగా, నెర్కర్ స్పదించలేదు. అనుమానం వచ్చి వారు అతని మిత్రులకు సమాచారం ఇచ్చారు. వారు అతని గది దగ్గరకు వెళ్లి చూడగా, లోపలి నుంచి గడియ పెట్టినట్టు గుర్తించారు. వెంటనే వసతి గృహ గార్డ్‌కు సమాచారమిచ్చారు. తలుపు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లి చూడగా నెర్కర్ శవమై కనిపించాడు. తల్లిందడ్రులకు సమాచారం చేరవేసి, మృతికి గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. 
 
కోటాలో దారుణం... 16 యేళ్ల బాలికపై నలుగురు నీట్ విద్యార్థుల అత్యాచారం 
 
రాజస్థాన్ రాష్ట్రలోని కోటాలో దారుణం జరిగింది. కోటాలో నీట్ ప్రవేశ పరీక్ష కోసం శిక్షణ తీసుకుంటున్న 16 యేళ్ల బాలికపై నీట్ కోచింగ్ తీసుకుంటున్న నలుగురు విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలికను తమ గదికి రప్పించిన ఓ విద్యార్థి.. మరో ముగ్గురు విద్యార్థుల సాయంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపీసీతో పాటు పోక్సో చట్టం నిందితులపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. 
 
కోటాలో ఈ నెల 10వ తేదీన జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, ఓ బాలిక రెండు మూడు రోజులుగా తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతుందని గమనించిన ఆమె స్నేహితురాళ్లు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమలో అధికారుల ఆ బాలికకు కౌన్సిలింగ్ ఇవ్వగా, బానిక తనకు జరిగిన దారుణాన్ని అధికారులకు చెప్పింది. కోటాలో చదువుకుంటున్న మరో నీట్ అభ్యర్థి బాధితురాలికి సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడు. 
 
ఈ ఘటన జరిగిన రోజున ఏదో కారణంతో ఆమెను తన గదికి పిలిపించాడు. ఆ తర్వాత మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసిన కోట పోలీసు... గ్యాంగ్ రేప్ నేరంతో పాటు పలు ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులందరూ స్థానికంగా ఉన్న ఓ కోచింగ్ సెంటరులో నీట్ కోసం సిద్ధమవుతున్నారు. నిందితుల్లో ఒకరిది వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కాగా, మిగిలినవారంతా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన యువకులుగా గుర్తించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీసాలపై బ్రిటన్ కఠిన ఆంక్షలు - భారతీయుల్లో ఆసక్తి తగ్గుదల