Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీసాలపై బ్రిటన్ కఠిన ఆంక్షలు - భారతీయుల్లో ఆసక్తి తగ్గుదల

Advertiesment
students

ఠాగూర్

, శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (12:56 IST)
అంతర్జాతీయ విద్యార్థి వీసాలపై బ్రిటన్ ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. దీంతో అక్కడి విద్యాభ్యాసం చేయాలన్న భారతీయ విద్యార్థుల్లో ఆసక్తి బాగా తగ్గిపోతుంది. బ్రిటన్‌లోని యూనివర్సిటీస్ అండ్ కాలేజస్ అడ్మిషన్స్ సర్వీసెస్ విభాగం (యూసీఏఎస్) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెలుగుచూసింది. గతేడాదితో పోలిస్తే ఈమారు బ్రిటన్‌లో అండర్ గ్యాడ్యుయేట్ కోర్సుల్లో భారతీయ స్టూడెంట్ల దరఖాస్తుల సంఖ్య 4 శాతం తగ్గి 8,770కు పరిమితమైంది. నైజీరియా విద్యార్థుల దరఖాస్తులు ఏకంగా 46 శాతం మేర తగ్గి 1,590కు చేరుకున్నాయి. బ్రిటన్‌లో ఈ ఏడాది అంతర్జాతీయ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య స్వల్పంగా పెరిగినా భారతీయుల దరఖాస్తులు మాత్రం తగ్గడం గమనార్హం.
 
ప్రభుత్వం గణాంకాల ప్రకారం, అండర్ గ్యాడ్యుయేట్ కోర్సుల్లో విదేశీ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య ఈ మారు 0.7 శాతం పెరిగింది. చైనా విద్యార్థుల దరఖాస్తులు అత్యధికంగా 3 శాతం పెరిగి 910కు చేరాయి. తుర్కియే, కెనడా విద్యార్థుల దరఖాస్తులూ పెరిగాయి. అయితే, గ్రాడ్యుయేట్ వీసాల జారీని సమీక్షిస్తామని రిషి సునాక్ ప్రభుత్వం ప్రకటించడమే భారతీయ విద్యార్థుల విముఖతకు కారణమన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ వీసా పథకంలో విదేశీ విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక మరో రెండేళ్ల పాటు బ్రిటన్‌లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు.
 
ఇక బ్రిటన్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న విదేశీ విద్యార్థులకు తమ కుటుంబాలను వెంట తెచ్చుకునే అవకాశం లేకపోవడం మరో కారణమని తెలుస్తోంది. గత నెలలోనే ఈ నిబంధనలు అమల్లోకి తెచ్చారు. అయితే, వీరందరూ వచ్చేసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని యూసీఎఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డా.జో శాక్స్‌టన్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ పెయింట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం ... 11 మంది సజీవదహనం