Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంగవైకల్యంతో పుట్టిన బిడ్డను చంపుకోలేక 22 అంతస్తుల నుంచి దూకేసిన తల్లి

Advertiesment
jyothi
, మంగళవారం, 17 జనవరి 2023 (13:23 IST)
అంగవైకల్యంతో పుట్టిన బిడ్డను చూస్తూ ఆ తల్లి మనస్సు తల్లడిల్లిపోయింది. అలాగని అతన్ని చంపుకోలేక, పోషించనూ లేక కుమిలిపోయింది. పైగా, అంగవైక్యలంతో పుట్టిన బిడ్డను చూసి ఆమె భర్త నిరాదారణకు గురిచేశాడు. ఆ పుట్టిన బిడ్డను వదిలించుకోవాలంటూ భార్యను భర్త నిత్యం వేధించసాగాడు. అలా మూడేళ్ల సమయం గడిచిపోయింది. అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా, భర్తను నమ్మి హైదరాబాద్ వచ్చిన పాపానికి ఆ మహిళకు నానాటికీ వేధింపులు ఎక్కువై పోయాయి. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అంతే.. 22వ అంతస్తు నుంచి దూకి అత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. 
 
కాకినాడకు చెందిన నేమాని శ్రీధర్‌కు సర్పవరంకు చెందిన స్వాతి అనే మహిళతో గత 2013లో వివాహం జరిగింది. మూడేళ్ల తర్వాత ఈ దంపతులకు కుమారుడు పుట్టాడు. అయితే మానసిక వైకల్యంతో పుట్టడంతో కొడును శ్రీధర్ దరిచేరనీయలేదు. బిడ్డ తనకు వద్దంటూ భార్యతో గడవపడసాగాడు. దీంతో స్వాతి పుట్టింటిలోనే ఉండిపోయింది. అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకోసాగింది. అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా, భార్యను వేధించసాగాడు. 
 
ఈ క్రమంలో మాటమార్చిన శ్రీధర్.. భార్యాబిడ్డలను బాగా చూసుకుంటానని నమ్మించి కాకినాడ నుంచి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చాడు. కొన్ని రోజుల తర్వా మళ్లీ వేధించసాగాడు. శ్రీధర్ వేధింపులకు అత్తింటివారు కూడా వంతపాడసాగారు. దీంతో విరక్తి చెందిన స్వాది.. మంగళవారం తాము నివసించే అపార్ట్‌మెంటు పైకెక్కి అక్కడ నుంచి కిందకు దూకేసింది. 22వ అంతస్తు పై నుంచి దూకడంతో స్వాతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్వాతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు శ్రీధర్‌ను అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన యూజీసీ