Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యువతికి ఎరవేసిన వివాహితుడు.. సహకరించిన భార్య.. ఆపై పెళ్లి కూడా చేసింది...

Advertiesment
harassment
, గురువారం, 17 ఆగస్టు 2023 (11:52 IST)
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహితుడు ఓ యువతికి ఎరవేశాడు. ఈ పాడుపనికి కట్టుకున్న భార్య సైతం భర్తకు సహకరించింది. ఆ యువతిని లోబరుచుకున్న తర్వాత భర్తకిచ్చి పెళ్లి చేసింది. ఆ తర్వాత యువతిని వేధించడం మొదలుపెట్టారు. ఈ వేధింపులు భరించలేక ఆ యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసుల కథనం మేరకు.. బంజారాహిల్స్ సింగాడికుంటకు చెందిన దీప్తి అనే విద్యార్థిని.. యూసుఫ్ గూడలో ఓ డ్యాన్స్ స్కూలు వచ్చేది. అక్కడ ఆమెకు... హోం ట్యూషన్‌లు చెప్పే కరజాడా గాంధీ అనే వ్యక్తితో పరియం ఏర్పడింది. దీప్తిని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని గాంధీ నమ్మబలికాడు. అయితే.. అప్పటికే అతడికి రోజా అనే యువతితో పెళ్లయిందన్న విషయం తెలియని దీప్తి అందుకు అంగీకరించింది.
 
ఇద్దరూ కలిసి కుటుంబీకులను ఒప్పించుకున్నారు. పెళ్లి నిశ్చయమయ్యాక గాంధీ వ్యవహారశైలిపై దీప్తి కుటుంబానికి అనుమానాలు కలిగాయి. ఆరా తీయగా.. అతడికి రోజాతో సంబంధాలున్నట్టు తెలిసింది. గాంధీని నిలదీయగా.. అతడు బుకాయించాడు. రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఈ వ్యవహారం బంజారాహిల్స్ ఠాణాకు చేరింది. సరిగ్గా ఆ సమయంలో రోజా పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. తాను గాంధీ స్నేహితురాలిని మాత్రమేనని వేరే ఏ సంబంధమూ లేదని నమ్మబలికింది. దగ్గరుండి అన్ని ఏర్పాట్లూ చేసి గాంధీ, దీప్తికి పెళ్లి చేస్తానంది. దీప్తి కుటుంబసభ్యులు ఆమె మాటలను నమ్మి ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. 
 
దీంతో మే 11వ తేదీన దీప్తి, గాంధీ వివాహం జరిగింది. నాలుగు రోజుల పాటు వారి కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత గాంధీ రోజూ రాత్రిపూట ఆలస్యంగా వస్తుండటంతో దీప్తి నిలదీసింది. ఆ మర్నాడే రోజా కూడా వారి వద్దకొచ్చి చేరింది. రోజా, గాంధీ ఇద్దరూ కలిసి దీప్తిని వేదించడం మొదలుపెట్టారు. రోజా దీప్తిని రోజూ రోడ్డు మీదకు తీసుకొచ్చి చావబాదేది. 
 
ఈ చిత్రహింస భరించలేక నాలుగు రోజుల కిందే దీప్తి తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. రోజా తన మనుషులతో కలిసి దీప్తి పుట్టింటికి వచ్చి గొడవచేసింది. దీంతో అసలు రోజాకు గాంధీకి ఉన్న సంబంధం ఏంటా అని ఆరా తీయగా.. వారిద్దరికీ పెళ్లయిన విషయం బయటపడింది. తాను మోసపోయినట్టు గ్రహించిన దీప్తి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు గాంధీ, రోజాపై కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టిన వాలంటీర్ - భార్య ఆత్మహత్యాయత్నం