Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

Advertiesment
crime news

ఠాగూర్

, సోమవారం, 18 ఆగస్టు 2025 (17:13 IST)
హైదరాబాద్ నగరంలో పదేళ్ల బాలిక దారుణహత్యకు గురైంది. కూకట్‌పల్లి సంగీత్‌ నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి యత్నించాడు. అయితే, ఆ బాలిక ఎదురు తిరిగింది. దీంతో జీర్ణించుకోలేని ఆ యువకుడు ఆమెను కత్తితో పొడవడంతో ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. 
 
పోలీసుల కథనం మేరకు.. సంగీత్‌ నగర్‌లో కుమారుడు, కుమార్తెతో కలిసి దంపతులు నివాసముంటున్నారు. తండ్రి బైక్‌ మెకానిక్‌.. తల్లి ల్యాబ్‌ టెక్నీషియన్‌. బాలిక కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం తల్లిదండ్రులు తమ కుమారుడిని స్కూల్‌కు పంపి విధులకు వెళ్లారు. కుమార్తెకు స్కూల్‌ సెలవు కావడంతో ఇంట్లోనే ఒంటరిగా ఉంది. 
 
మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కుమారుడి లంచ్‌ బాక్స్‌ తీసుకెళ్లేందుకు తండ్రి ఇంటికి వచ్చాడు. పడక గదిలో పొట్టపై కత్తి పోట్లతో బాలిక విగతజీవిగా పడి ఉండటాన్ని ఆయన గుర్తించాడు. తన కుమార్తెను దుండగుడు హతమార్చినట్లు అనుమానిస్తూ కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 
 
కూకట్‌పల్లి పోలీసులతో పాటు బాలానగర్‌ డీసీపీ సురేశ్‌కుమార్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌టీమ్‌తో ఆధారాలను సేకరించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
పోలీసుల విచారణలో అసలు విషయం వెల్లడైంది. బాలిక ఎదురు తిరగడంతో కత్తితో పొడిచి హత్య చేసినట్టు సీసీ టీవీ కెమెరాల్లో నమోదైంది. బాలిక ఒంటరిగా ఉందని తెలిసి వెళ్లడంతో యువకుడు దగ్గరి బంధువుగా అనుమానిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీళ్లేమో వీధి కుక్కల్ని చంపొద్దంటారు, అవేమో ప్రజల పిక్కల్ని పీకుతున్నాయి