Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హస్తినలో దారుణం : మైనర్ బాలుడిపై కబడ్డీ కోచ్ అత్యాచారం

Advertiesment
victimboy
, శుక్రవారం, 23 డిశెంబరు 2022 (14:44 IST)
దేశ రాజధాని న్యూ ఢిల్లీ నేరాలకు ఘోరాలు, అత్యాచారాలకు అడ్డాగా మారిపోయింది. అమ్మాయిలో కాదు మైనర్లు కూడా బాధితులవుతున్నారు. తాజాగా ఓ 15 మైనర్ బాలుడిపై కబడ్డీ కోచ్ అత్యాచారానికి తెగబడిన దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రోహిణి జిల్లా కంఝవాలా ప్రాంతంలోని ఓ కబడ్డీ శిక్షణా కేంద్రంల 15 యేళ్ల బాలుడు కబడ్డీ నేర్చుకునేందుకు చేరాడు. శిక్షణ కోసం ప్రతిరోజూ వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఆ బాలుడు శిక్షణకు వెళ్లడం మానేశాడు. పైగా, తల్లిదండ్రులు ఒత్తిడి చేసినప్పటికీ అక్కడకు వెళ్లేందుకు ససేమిరా అన్నాడు. 
 
ఆ తర్వాత తల్లిదండ్రులు ఆ బాలుడిని దగ్గర కూర్చోబెట్టుకుని నయతారంగా అడగడంతో అసలు విషయం వెల్లడించాడు. కబడ్డీ కోచ్ తనతో నీచమైన పని చేసేవాడని బాధిత బాలుడు బోరున విలపిస్తూ చెచ్పాడు. దీంతో బాధితుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. 
 
తన వద్దకు శిక్షణకు వచ్చే విద్యార్థులతో కోచ్ అసహజ శృంగారానికి పాల్పడేవాడని తేలింది. దీంతో అతనిపై ఐపీసీ 377, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాడు. ఇంత నీచానికి దిగజారిన కోచ్‌ను కఠినంగా శిక్షించాలని బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కైకాలకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు : మంత్రి తలసాని