Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాతో గడిపేందుకు హోటల్ గదికి రా, లేదంటే నీ ఏకాంత వీడియోలు బైటపెడతా: టెక్కీ సూసైడ్

Advertiesment
deadbody

ఐవీఆర్

, శుక్రవారం, 17 జనవరి 2025 (18:54 IST)
బెంగళూరులో దారుణం చోటుచేసుకున్నది. బెంగళూరులోని ఒక హోటల్ గదిలో 24 ఏళ్ల మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకుని మరణించింది. ప్రధాన నిందితుడైన ఆ మహిళ మామను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై లోతుగా దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం కుండలహళ్లి మెట్రో స్టేషన్ సమీపంలోని రాధా హోమ్‌టెల్ వద్ద ఆమె మామ తనను కలవమని బలవంతం చేయడంతో సదరు మహిళ బలవన్మరణానికి పాల్పడింది.
 
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. బెంగళూరులోని ఓ ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో బాధితురాలు ఇంజినీరుగా పనిచేస్తుంది. తను పని చేస్తున్న కంపెనీకి దగ్గరలో వుంటున్న మామయ్య, అత్తయ్య వాళ్లింటికి కూడా తరచూ వెళ్తూ వుండేది. పలుసార్లు వాళ్లతో కలిసి సందర్శనా ప్రాంతాలకు కూడా వెళ్లింది. ఈ క్రమంలో అతడు బాధితురాలిని లొంగదీసుకున్నాడు. భార్య ఇంట్లో లేని సమయంలో బాధితురాలితో గడపడం మొదలుపెట్టాడు. ఐతే ఈమధ్య కాలంలో అతడిని దూరం పెట్టేసింది. మరో యువకుడితో కలిసి తిరుగుతూ ఇతడికి దూరంగా వుండటం ప్రారంభించింది. ఐతే యువకుడితో కలిసి ఏకాంతంగా గడుపుతున్నప్పుడు రహస్యంగా వీడియో తీసాడు బాధితురాలి మామయ్య.
 
వాటిని ఆమెకి చూపించి తన కోర్కె తీర్చాలంటూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తను చెప్పినట్లు వినకపోతే ఆ ఫోటోలను ఆమె తల్లిదండ్రులకు పంపుతానంటూ బెదిరించాడు. అంతటి ఆగక ఏకంగా బెంగళూరులో ఓ హోటల్ గదిని బుక్ చేసి అక్కడికి వచ్చి తన కోర్కె తీర్చాలంటూ పట్టుబట్టాడు. అందుకు బాధితురాలు ససేమిరా అని చెప్పింది. రాకపోతే న్యూడ్ ఫోటోలను మీ పేరెంట్స్ కి పంపుతానని బెదిరించడంతో ఇష్టం లేకుండానే ఆమె హోటల్ గదికి వచ్చింది. ఐతే వస్తూనే ఓ పెట్రోల్ బాటిల్ కొనుక్కుని వచ్చింది.
 
అతడు తన కోర్కె తీర్చాలంటూ ఒత్తిడి పెంచడంతో తనవద్ద వున్న పెట్రోల్ బాటిల్ మూత తీసి శరీరంపై పోసుకుని నిప్పు పెట్టుకుంది. ఆమెను కాపాడేందుకు అతడు ప్రయత్నించినా ఆమె శరీరం 60 శాతానికి పైగా గాయాలపాలైంది. ఈ క్రమంలో అతడి చేతులు కూడా కాలాయి. తనను లైంగికంగా వేధింపులకు గురిచేసాడని బాధితురాలు తన సోదరికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి నుంచి పెన్ డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.200 నోటును ఆర్బీఐ రద్దు చేయనుందా?