హైదరాబాద్ నగర కేంద్రంగా పని చేస్తున్న సంధ్య కన్వెన్షన్ సెంటర్ ఎండీ శ్రీధర్ రావుపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఓ భవన నిర్మాణంలో పలువురి వ్యక్తులను మోసం చేసిన కేసులో వ్యాపారవేత్త సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	భవన నిర్మాణం చేస్తున్న సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు అమ్మకాల విషయంలో కొనుగోలుదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. 
 
									
										
								
																	
	 
	దీంతో మోసపోయిన కొనుగోలుదారులు శ్రీధర్ రావుపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు.. శ్రీధర్ రావును అరెస్టు చేశారు. శ్రీధర్‌రావుపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు మాదాపూర్ ఏసీపీ రఘునందన్ తెలిపారు.