ఆ ముగ్గురు టీనేజర్లు. పక్క ఇంటి డోర్ బెల్ కొట్టి కొద్దిసేపు ఆటపట్టించారు. దీంతో పక్కింటి వ్యక్తి ఆ ముగ్గురు టీనేజర్లను దారుణంగా హత్య చేశారు. ఈ దారుణం అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కొందరు టీనేజర్లు తన ఇంటి డోర్‌బెల్‌ను మోగించి ఆటపట్టించారని, ఆ సమయంలో తాను మద్యం మత్తులో ఉన్నానని.. తన కుటుంబ సభ్యుల భద్రత గురించి భయపడ్డానని చంద్ర విచారణలో తెలిపాడు. వారు తన వెనుక భాగంపై చరిచి కారులో పారిపోవడానికి యత్నించారని, వారిని నిలదీసేందుకు తన కారులో వారిలో అనుసరించానని.. ఈక్రమంలోనే అనుకోకుండా తన కారు వారి వాహనాన్ని ఢీకొట్టిందని పేర్కొన్నాడు.
ఈ ఘటనలో వారి వాహనం చెట్టుకు ఢీకొనడంతో ముగ్గురు కుర్రాళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో చంద్రకు పెరోల్ అవకాశం లేకుండా యావజ్జీవ శిక్ష పడొచ్చని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటన 2020 జనవరి 19వ తేదీన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి నమోదైన కేసులో రివర్‌సైడ్ కౌంటీ నివాసి అనురాగ్ చంద్రను న్యాయస్థానం దోషిగా తేల్చింది.