Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్ సంతకం చేసిన తొలి ఫైలు ఏది?

kcr first signature
, ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (19:59 IST)
తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం సందర్భంగా ఫైళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా మంత్రులు తమతమ ఛాంబర్లలో ఆదివారం ఆశీనులై తొలి సంతకాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గృహ లక్ష్మి, పోడు భూముల పంపిణీపై తొలి సంతకం చేశారు. అలాగే, మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సంతకం చేశారు.
 
హోం మంత్రి మహమూద్ ఆలీ కొత్త పోలీస్ స్టేషన్ల మంజూరుపై, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జంటనగరాల్లోని హిందూ దేవాలయాల్లో దూప దీప నైవేద్యాల పైలుపైన, మంత్రి మల్లారెడ్డి శ్రమ శక్తి అవార్డుల ఫైలుపైనా, మంత్రి గంగుల కమలాకర్ అంగన్ వాడీలకు సన్నబియ్యం పంపిణీపై సంతకాలు చేశారు. 
 
అలాగే, మంత్రి కొప్పుల ఈశ్వర్ రెండో విడత దళిత బంధు పధకం ఫైలుపై, మంత్రి హరీష్ రావు సీతారామ ప్రాజెక్టు ఫైలుపై, మంత్రి నిరంజన్ రెడ్డి చెక్ డ్యాంల నిర్మాణం ఫైలుపై, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి కొత్త మండలాలకు ఐకేపీ భవన నిర్మాణాల అనుమతి ఫైలుపై, మంత్రి సత్యవతి  రాథోడ్ అంగన్ వాడీ కేంద్రాల్లో ఒకటి మూడు సంవత్సరాల మధ్య ఉన్న చంటి పిల్లలకు ఉచితంగా పాలు పంపిణీ ఫైలుపై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉచిత చేప పిల్లల పంపిణీ ఫైలుపై సంతకాలు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్ర మొత్తం కూలగొట్టి కడతారా అంటూ హేళన చేశారు :: సీఎం కేసీఆర్