Publish Date: Sat, 25 Apr 2026 (13:06 IST)
Updated Date: Sat, 25 Apr 2026 (13:07 IST)
మద్యం మత్తులో అక్కను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడనే కోపంతో.. అక్క మొగుడిని బావమరిది హతమార్చిన ఘటన విశాఖపట్నం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
తన సోదరిని వేధిస్తున్నాడనే ఆగ్రహంతో ఒక ఆటో డ్రైవర్, ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు. తన సోదరిని కొట్టవద్దని శ్రీను పలుమార్లు ప్రశాంత్‌ను మందలించినప్పటికీ అతని తీరు మారలేదు.
దీంతో ఆగ్రహానికి గురైన శ్రీను, పక్కా పథకం ప్రకారం శుక్రవారం రాత్రి కైలాసపురం వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రశాంత్‌ను అడ్డుకుని కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు.
ఈ దాడిలో ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆపై పోలీసుల ఎదుట నిందితుడు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.