Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మద్యం మత్తులో భార్యను కిరాతకంగా దాడి చేసిన భర్త... పుర్రెను చీల్చుకుని నోట్లో నుంచి...

Advertiesment
wife attacked with knife

ఠాగూర్

, బుధవారం, 22 అక్టోబరు 2025 (09:21 IST)
ఏపీలోని కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ భర్త అత్యంత కిరాతంగా ప్రవర్తించి, తన భార్యపై దాడి చేసాడు. నుదుటిపై దించిన కత్తి పుర్రెను చీల్చుకుని నోట్లో నుంచి బయటకు వచ్చింది. అయితే ఈ ఘటనపై బాధితురాలు ప్రాణాలతో బయటపడటం గమనార్హం. 
 
పోలీసుల కథనం మేరకు.. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఉడిమూడి గ్రామానికి చెందిన నేలపూడి గంగరాజు, పల్లాలమ్మ (36) ఇరవై ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, గంగరాజు మద్యానికి బానిసై తరచూ భార్యను వేధించసాగాడు. ఈ క్రమంలో సోమవారం దీపావళి సందర్భంగా బాణసంచా కోసం భార్యకు ఇచ్చిన డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
 
సోమవారం రాత్రి 11 గంటల సమయంలో పీకలవరకు మద్యం సేవించి ఇంటికి వచ్చిన గంగరాజు, భార్యతో మరోసారి వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతను, తన వద్ద ఉన్న కత్తితో ఆమె గొంతులో పొడిచేందుకు ప్రయత్నించాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నంలో తల వంచడంతో, కత్తి ఆమె ఎడమ కన్ను పైభాగం నుంచి నేరుగా నోట్లోకి దిగింది.
 
ఈ దారుణాన్ని చూసిన కుటుంబసభ్యులు, బంధువులు వెంటనే ఆమెను అమలాపురంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే దీపావళి సెలవు కావడంతో అక్కడ వైద్యులు అందుబాటులో లేరు. దీంతో బాధితురాలిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి, కత్తిని విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పి.గన్నవరం ఎస్ఐ బి.శివకృష్ణ తెలిపారు. నిందితుడు గంగరాజు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. చిన్నపాటి గొడవ ఇంతటి దారుణానికి దారితీయడంతో స్థానికంగా కలకలం రేగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయ విద్యార్థులకు శుభవార్తం - హెచ్-1బీ వీసా ఫీజు చెల్లించక్కర్లేదు...