Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

Advertiesment
rape

ఐవీఆర్

, శనివారం, 22 మార్చి 2025 (14:10 IST)
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల కేసులు నమోదు ఎక్కువవుతున్నాయి. కారణాలు ఏమయినప్పటికీ పెళ్లయిన జంటలలో కొందరు విడిపోవడమో లేదా దూరంగా వుండటమో జరుగుతుంది. ఈ కారణంతో ఒంటరిగా వున్న మహిళలపై కామాంధులు కన్నేస్తున్నారు. లొంగదీసుకుని చివరికి వారి జీవితాలను అధోగతిపాల్జేస్తున్నారు.
 
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండలానికి చెందిన దంపతుల విషయంలో ఇదే జరిగింది. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో భార్య తన కుమార్తెను తీసుకుని భువనగిరి జిల్లా ఘట్కేసర్‌లో వుంటోంది. ఒంటరిగా వున్న ఆ మహిళపై మరిది వరసయ్యే రాము అనే వ్యక్తి కన్నేసాడు. ఆమెకు అవసరమైన పనుల్లో చేదోడువాదోడుగా వుండటంతో అతడితో ఆమె సన్నిహిత సంబంధం ఏర్పరుచుకుంది. ఫలితంగా ఇద్దరూ ఏకాంతంగా గడపడం చేస్తూ వచ్చారు.
 
ఐతే ఈ కామాంధుడు దృష్టి వొదినతో పాటు ఆమె 16 ఏళ్ల కుమార్తెపై పడింది. తన కోర్కె తీర్చుకునేందుకు సహకరించాలంటూ వొదినపై వత్తిడి తెచ్చాడు. అప్పటికే అతడికి పూర్తిగా లొంగియి వున్న ఆ మహిళ కుమార్తెను కూడా ఆ కామాంధుడికి అప్పగించింది. దాంతో అతడు ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. ఈ విషయంలో బాలిక తన అమ్మమ్మకి తెలియపరచడంతో గుట్టుచప్పుడు కాకుండా బాలికకు అబార్షన్ చేయించారు. ఐతే విషయం బైటకు రావడంతో పోలీసులు కామాంధుడిపైన, ఆమె తల్లిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Netumbo: నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా నంది-న్దైత్వా ప్రమాణం