Publish Date: Thu, 04 Jun 2026 (08:44 IST)
Updated Date: Thu, 04 Jun 2026 (08:44 IST)
ఓ మహిళను అన్నాదమ్ములిద్దరూ బెదిరించి వీడియో తీస్తూ అత్యాచారానికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... పల్నాడు జిల్లాలోని నకరికల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ భర్తతో విడాకులు తీసుకుని ముగ్గురు కుమార్తెలతో నివాసం ఉంటోంది. అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి సుధాకర్‌తో నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మాట్లాడాలని సుధాకర్ ఫోన్ చేయడంతో గ్రామ శివారుకు మహిళ వచ్చింది. అప్పటికే మద్యం తాగివున్న సుధాకర్, అతడి సోదరుడు శ్రీను ఆమెను కట్టేసి వీడియో తీస్తూ అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆమె వారి నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లిపోగా, అక్కడికి సుధాకర్ వచ్చి మరోమారి అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఆమె డయల్ 100కు ఫోన్ చేయడంతో నకరికల్లు పోలీసులు చేరుకుని రక్షించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు మోదు చేశారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు.