Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నకూతురిని గర్భవతిని చేసిన కామాంధ తండ్రి... నిగ్గుతేల్చిన డీఎన్ఏ టెస్ట్

Advertiesment
victim
ముంబై మహానగరంలో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మూగ, చెవిటి యువతిపై అత్యాచారం జరిగింది. ఫలితంగా ఆ యువతి గర్భందాల్చింది. ఈ కేసులో నిందితుడుని గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు చేయగా, షాకింగ్ నిజం ఒకటి వెలుగు చూసింది. ఆ యువతిని కన్నతండ్రే ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడుని అరెస్టు చేశారు. 
 
ముంబైలోని కఫీ పరేడ్‌ ఏరియాకు చెందిన ఓ బధిర యువతి గత యేడాది అనారోగ్యానికి గురైంది. కడుపు నొప్పింగా ఉందంటూ సైగలతో నానమ్మకు చెప్పింది. దీంతో ఆ యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ జరిపిన వైద్య పరీక్షల్లో ఐదు నెలల గర్భవతి అని వైద్యులు తేల్చి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే, కేసు పెట్టేందుకు బాధితురాలు లేదా ఆమె తండ్రి ముందుకు రాలేదు. 
 
ఆ తర్వాత యువతికి కౌన్సెలింగ్ ఇచ్చి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. ఓ 17 యేళ్ల బాలుడిని అదుపులోకి తీసుకోగా, 16 మందిని అనుమానితులుగా తేల్చారు. వీరిలో యువతిపై అత్యాచారం జరిపింది ఎవరన్న విషయం నిర్ధారించందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. 
 
యువతి తండ్రి సహా మొత్తం 17 మంది డీఎన్ఏను యువతి గర్భంలో పెరుగుతున్న పసికందు డీఎన్ఏతో పోల్చి చూడగా, యువతి కన్నతండ్రి డీఎన్ఏ ఒక్కటే మ్యాచ్ అయింది. దీంతో యువతిపై అత్యాచారం జరిపి ఆమెను గర్భవతిగా చేసిన నిందితుడు కన్నతండ్రేనని స్పష్టమైంది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెత్తలో బంగారం: పారిశుద్ధ్య కార్మికురాలిని ప్రపంచ సుందరి అంటూ నటుడు పార్థీబన్