మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తరగతి గదిలోనే ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. కుల్వకుర్తికి చెందిన అరాధ్య బాలానగర్ మండల కేంద్రంలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి విద్యాభ్యాసం చేస్తుంది. ఇంతలో ఏంజ జరిగిందో ఏమోగానీ, గురువారం ఉదయం పాఠశాల తరగతి గదిలో ఆరాధ్య ప్రాణాలు తీసుకుంది.
గురువారం ఉదయం 6.30 గంటలకు ఆరాధ్య తరగతి గదిలోని సీలింగ్ ఫ్యానుకు ఉరేసుంది. దీన్ని గమనించిన సహచర విద్యార్థులు టీచర్లకు సమాచారం చేరవేశారు. ఆ వెంటనే వారంతా పరుగున వచ్చి ఆరాధ్యను రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆ విద్యార్థిని చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. అయితే, ఆరాధ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.