Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాయనా శిఖరా... కొడితే కొడతావు లేదంటే డకౌటవుతావు... ఏంటీ బాబూ నువ్వూ...

Advertiesment
నాయనా శిఖరా... కొడితే కొడతావు లేదంటే డకౌటవుతావు... ఏంటీ బాబూ నువ్వూ...
, మంగళవారం, 11 జూన్ 2019 (19:44 IST)
శిఖర్ ధావన్ ఎప్పుడూ అంతే... నాయనా శిఖరా... కొడితే కొడతావు లేదంటే కూర్చుంటావు... ఏంటీ బాబూ నువ్వూ... అంటూ సెటైర్లు వేస్తున్నారు క్రికెట్ క్రీడాభిమానులు. శిఖర్ ధావన్‌ గాయం కారణంగా దూరం కావడం టీమిండియాకి గట్టి దెబ్బ అంటూ హర్భజన్ చెప్పాడు.

భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ల మధ్య ఆదివారం వరల్డ్ కప్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ శతకం సాధించడం ద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా వరల్డ్ కప్‌లో భారత క్రికెటర్ శిఖర్ శతకం 27వ సెంచరీగా నిలిచింది. దీంతో వరల్డ్ కప్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. 
 
ఇంతకుముందు ఆస్ట్రేలియా 26 శతకాలు సాధించిన జట్టుగా వుంది. ప్రస్తుతం ఆ రికార్డును భారత్ 27 శతకాలతో అధిగమించింది. ఈ రికార్డును భారత్‌కు సంపాదించి పెట్టిన శిఖర్ ధావన్ ఇకపై జరుగనున్న వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో ఆడటం లేదని షాకింగ్ న్యూస్ వచ్చేసింది. దీంతో టీమిండియాకు ప్రపంచ కప్‌లో ఎదురు దెబ్బ తప్పేలా లేదు.
 
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు చేతి వేలికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు యాజమాన్యం అతడి ఎడమచేతి బొటన వేలుకు మంగళవారం స్కానింగ్‌ చేయించింది. దీంతో మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో అతడి స్థానంలో యువ ఆటగాడు రిషభ్‌పంత్‌కు చోటుదక్కే అవకాశం కనిపిస్తోంది.
 
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కౌల్టర్‌నైల్‌ విసిరిన బంతి గబ్బర్‌ చేతికి బలంగా తగిలింది. నొప్పితో ఇబ్బంది పడినా 109 బంతుల్లో 117 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే నొప్పి వల్ల ఆసీస్‌ మ్యాచ్‌లో గబ్బర్‌ ఫీల్డింగ్‌ చేయలేదు. 
 
అతడి స్థానంలో 50 ఓవర్లు రవీంద్ర జడేజా ఫీల్డింగ్‌ చేశాడు. ఇదిలా ఉండగా టీమిండియా గురువారం న్యూజిలాండ్‌తో తలపడనుంది. దీంతో ఆ మ్యాచ్‌లో రోహిత్‌కు జోడీగా ఎవరు ఓపెనింగ్‌ చేస్తారో తెలియాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గబ్బర్‌ చేతికి బలంగా గాయం.. 3వారాలు విశ్రాంతి.. భారత్‌కు ఎదురు దెబ్బ (video)