Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ చరిత్ర పునరావృతమైతే విశ్వవిజేతగా టీమిండియా?

Advertiesment
ఆ చరిత్ర పునరావృతమైతే విశ్వవిజేతగా టీమిండియా?
, మంగళవారం, 9 జులై 2019 (16:06 IST)
మాంచెస్టర్ మైదానంలో క్రికెట్ ప్రపంచ కప్ మొదటి సెమీ ఫైనల్ భారత్-న్యూజీలాండ్ మధ్య జరగబోతోంది. 2015 తర్వాత భారత్ న్యూజీలాండ్‌తో సెమీస్‌లో మరోసారి తలపడుతోంది. 2015లో న్యూజీలాండ్ సౌతాఫ్రికాను ఓడించి ఫైనల్లో అడుగుపెడితే, భారత్ ఆస్ట్రేలియా చేతిలో 95 పరుగుల తేడాతో ఓడింది. కానీ ఈసారీ గణాంకాలు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్నారు. న్యూజీలాండ్‌ను ఓడించి ఫైనల్లో చోటు అడుగుపెడతామని భారత్ ధీమాగా ఉంది. ఇంత నమ్మకం ఊరికే రాలేదు, దాని వెనుక యాదృచ్చికంగా జరిగినవి, కొన్ని గణాంకాలు కూడా ఉన్నాయి. నిజానికి 44 ఏళ్ల క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటివరకూ తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఓడిన జట్టు వరల్డ్ కప్ విజేత కాలేదు.
 
న్యూజీలాండ్ ఎనిమిదో సారి ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో ఆడుతోంది. అది ఆరోసారి చివరి లీగ్ మ్యాచ్ ఓడి సెమీ ఫైనల్‌కు వచ్చింది. ఐదుసార్లు ఓడిన తర్వాత 2015లో అది ఫైనల్ వరకూ చేరింది. కానీ అక్కడ కూడా అది ఓటమి రుచిచూడాల్సి వచ్చింది. దానితోపాటూ ఈసారీ వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచుల్లో న్యూజీలాండ్ మూడు మ్యాచ్‌లు ఓడి గ్రూప్ చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో 119 పరుగులతో ఓడిపోయింది. ఆస్ట్రేలియా కూడా దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. గ్రూప్ మ్యాచుల్లో చివరి మ్యాచ్ ఓడిన జట్టు విజేత కాలేకపోయిన ఇదే రికార్డు కొనసాగితే ఫైనల్లో భారత్‌దే విజయం అనుకోవచ్చు.
 
మొట్టమొదటి ప్రపంచ కప్‌లో వెస్టిండీస్ విజేతగా నిలిచింది. అప్పట్లో క్రికెట్‌లో వెస్టిండీస్ హవా కొనసాగేది. వెస్టిండీస్ గ్రూప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఏడు వికెట్లతో ఓడించింది. అయినా ఆస్ట్రేలియా సెమీఫైనల్లో చేరుకోవడంలో విజయవంతమైంది. అది సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. కానీ ఫైనల్లో వెస్టిండీస్ దానిని 17 పరుగుల తేడాతో ఓడించింది. వెస్టిండీస్ 1979లో మరోసారి వరల్డ్ కప్ గెలుచుకుంది. కానీ అది చివరి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజీలాండ్‌ను 32 పరుగుల తేడాతో ఓడించింది. అయితే ఈసారీ న్యూజీలాండ్ సెమీ ఫైనల్ చేరుకుంది. కానీ అక్కడ ఇంగ్లండ్ దానిని 9 పరుగుల తేడాతో ఓడించింది.
webdunia
 
1983లో వెస్టిండీస్ ఫైనల్ చేరుకుంది. కానీ భారత్ తన తొలి మ్యాచ్‌లోనే వెస్టిండీస్‌ను 34 పరుగుల తేడాతో ఓడించింది. దానితోపాటు పాకిస్తాన్ ఆరు లీగ్ మ్యాచుల్లో మూడింటిలో గెలిచింది. మూడింటిలో ఓడిపోయింది. ఆ తర్వాత పాకిస్తాన్ సెమీ ఫైనల్లో చోటు సంపాదించింది. కానీ అక్కడ వెస్టిండీస్ దానిని 8 పరుగుల తేడాతో ఓడించింది. భారత్, పాకిస్తాన్‌లో మొదటిసారి జరిగిన ఈ ప్రపంచ కప్‌ చివరి గ్రూప్ మ్యాచ్‌లో వెస్టిండీస్ పాకిస్తాన్‌ను 28 పరుగులతో ఓడించింది.
 
అయినా పాకిస్తాన్ సెమీ ఫైనల్ చేరుకోగలిగింది. కానీ అక్కడ ఆస్ట్రేలియా దానిని 18 రన్స్‌తో ఓడించింది. పాకిస్తాన్ రెండు సార్లు న్యూజీలాండ్‌ను ఓడించింది. 1992 ప్రపంచ కప్ పాకిస్తాన్ గెలుచుకుంది. పాకిస్తాన్ ఫైనల్లో ఇంగ్లండ్‌ను 22 రన్స్ తేడాతో ఓడించింది. కానీ అది అంతకు ముందు పాకిస్తాన్ సెమీ ఫైనల్లో, చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజీలాండ్‌ను ఓడించింది. 1996 ప్రపంచ కప్‌లో శ్రీలంక మొదటిసారి ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. కానీ ఇక్కడ కూడా న్యూజీలాండ్ ఓటమి రుచిచూడాల్సి వచ్చింది.
webdunia
 
గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరుకున్న న్యూజీలాండ్‌ను ఆస్ట్రేలియా ఓడించి, బయటకు పంపింది. (ఇది చెక్ చేయాలి) హిందీలో తప్పు రాసినట్లుంది. ఆస్ట్రేలియా 1999 ప్రపంచ కప్‌లో మరోసారి విజయం సాధించింది. గ్రూప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఓడిన తర్వాత పాకిస్తాన్ ఫైనల్ వరకూ వచ్చింది. కానీ చివర్లో అది ఆస్ట్రేలియా చేతిలో 8 వికెట్లతో ఓడింది. అలాగే 2003లో కెన్యా, 2007లో న్యూజీలాండ్, 2011లో వెస్టిండీస్, 2015లో దక్షిణాఫ్రికా లాంటి జట్లు గ్రూప్ మ్యాచులు లేదా సూపర్-8 మ్యాచుల్లో ఓటమి ఎదుర్కున్నాయి. కానీ అవి సెమీ ఫైనల్ ఆడి ఓడిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీక్ స్టేజీకి చేరిన కర్ణాటక సంక్షోభం: 21 మంది మంత్రుల మూకుమ్మడి రిజైన్!