Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేక్షకులను అలరించిన ఆ మూడు ఓవర్లు.. వర్షంతో నిలిచిన మ్యాచ్

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌-పాక్‌ మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో టీమిండియా మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ధావన్‌ పాక్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. 19, 20, 21 మూడు వరుస ఓవర్లలో భారత ఆటగాళ్లు భారీ పరుగులు రాబట్టడంతో పాటు ఓపె

ప్రేక్షకులను అలరించిన ఆ మూడు ఓవర్లు.. వర్షంతో నిలిచిన మ్యాచ్
హైదరాబాద్ , ఆదివారం, 4 జూన్ 2017 (18:42 IST)
ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌-పాక్‌ మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో టీమిండియా మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ధావన్‌ పాక్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. 19, 20, 21 మూడు వరుస ఓవర్లలో భారత ఆటగాళ్లు భారీ పరుగులు రాబట్టడంతో పాటు ఓపెనర్లు ఇద్దరూ అర్ధ శతకాలు నమోదు చేశారు. 
 
అంతకుముందు 16వ ఓవర్లో టీమిండియా అత్యధికంగా 13పరుగులు సాధించింది. ఆ తర్వాత 18వ ఓవర్లో 5వ బంతిని సిక్స్‌గా మలిచి రోహిత్‌ శర్మ అర్ధశతకం పూర్తి చేశాడు. 20వ ఓవర్లో శిఖర్‌ ధావన్‌ హ్యాట్రిక్‌ ఫోర్లు బాదాడు. అదే ఓవర్‌ ఐదో బంతికి రెండు పరుగులు సాధించి 50పరుగులు పూర్తి చేశాడు. తొలి 25ఓవర్లలో 20వ ఓవర్లోనే టీమిండియా అత్యధికంగా 15పరుగులు రాబట్టింది. 
 
ఆ తర్వాత 21వ ఓవర్లో తొలి బంతికి ఆరు పరుగులు లభించాయి. 20.2ఓవర్లో ధావన్‌ ఒక్క పరుగు సాధించడంతో ఓపెనర్ల భాగస్వామ్యం 100పరుగులు దాటింది. దీంతో స్టేడియంలో అభిమానుల సందడి రెట్టింపయ్యింది. జాతీయ పతాకాలను రెపరెపలాడిస్తూ తమ తమ అభిమాన జట్లకు మద్దతు పలుకుతున్నారు.
 
చివరి 5 ఓవర్లలో పాక్ బౌలర్లు పటిష్టమైన బౌలింగుతో కేవలం 15 పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్ స్కోరు మందగించింది. 33.1 ఓవర్ల వద్ద భారత్ ఒక వికెట్ నష్టానికి 173 పరుగులతో పటిష్ఠ స్థితిలో ఉన్నప్పుడు వర్షం కురవడంతో మ్యాచ్ తాత్కాలికంగా ఆగిపోయింది. వర్షం దోబూచులాడటంతో ఆట ఎప్పుడు మొదలయ్యేది సందిగ్ధంలో పడింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక్‌పై గెలిస్తే.. గొప్ప గౌరవమే కాదు.. గంగా నదిలో మునిగినంత పుణ్యం: సిద్ధూ