Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌ను ఓడించటం మావల్లకాదు.. ముందుగానే చేతులెత్తేసిన లంక

మంచి సమతూకంతో ఉన్న టీమిండియాను ఓడించడం చాలా కష్టమని, గెలవాలంటే మాత్రం తాము అత్యుత్తమ ప్రదర్శన చేయవలసి ఉంటుందని శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ మాథ్యూస్ చెప్పాడు. దీంతో ఆట మొదలు కాకముందే శ్రీలంక తమ నిస్సహాయతను చాటుకున్నట్లయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భా

Advertiesment
Srilanka
హైదరాబాద్ , గురువారం, 8 జూన్ 2017 (06:11 IST)
మంచి సమతూకంతో ఉన్న టీమిండియాను ఓడించడం చాలా కష్టమని, గెలవాలంటే మాత్రం తాము అత్యుత్తమ ప్రదర్శన చేయవలసి ఉంటుందని శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ మాథ్యూస్ చెప్పాడు. దీంతో ఆట మొదలు కాకముందే శ్రీలంక తమ నిస్సహాయతను చాటుకున్నట్లయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. మొదటి మ్యాచ్‌లో పాక్‌పై నెగ్గిన భారత్ ఊపు మీద ఉండగా సౌతాఫ్రికాపై ఓడిన శ్రీలంక జట్టుకు ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. 
 
ఈ నేపథ్యంలో లంక కెప్టెన్ మాథ్యూస్ మాట్లాడుతూ భారత్ జట్టు చాలా బాగా ఆడుతుందని చెప్పాడు. ముఖ్యంగా గత రెండు సంవత్సరాలుగా వారు అద్భుత ప్రదర్శన చేస్తున్నారని అన్నాడు. మంచి సమతూకంతో ఉన్న టీమిండియాను ఓడించడం చాలా కష్టమని, అందుకు తాము ఉత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుందని మాథ్యూస్ చెప్పాడు.
 
భారత్‌పై గెలుపు సాధించాలంటే ఆది నుంచి అఫెన్స్ లోకి వెళ్లడమే ఏకైక మార్గమని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగాక్కర శ్రీలంక జట్టుకు సూచించాడు. అన్ని ఫార్మేట్లలోనూ బలంగా ఉన్న టీమిండియాతో ఢిపెన్స్‌ ఆడే పని పెట్టుకోవద్దని, ఎదురు దాడి చేస్తేనే ఆటను లంక తన వైపుకు తిప్పుకునే అవకాశం ఉందని సంగాక్కర స్పష్టం చేశాడు. 
 
లండన్‌ చాంపియన్స్‌ట్రోఫీ సెమీఫైనల్లో చోటే లక్ష్యంగా గురువారం శ్రీలంకతో భారత జట్టు తలపడనుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించింది. మరోసారి అలాంటి ప్రదర్శనే కనబర్చి నాకౌట్‌ దశకు అర్హత సాధించాలని భావిస్తోంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరుస విజయాల జట్టు.. కోచ్ మాకొద్దంటోంది.. కుంబ్లేకు గడ్డుకాలం