Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరుస విజయాల జట్టు.. కోచ్ మాకొద్దంటోంది.. కుంబ్లేకు గడ్డుకాలం

బీసీసీఐకి ఈ తలనొప్పి ఇంతట్లో తగ్గేటట్టు లేదు. టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లేపై బీసీసీఐకి అపార గౌరవం ఉన్నప్పటికీ కుంబ్లే మాకు వద్దే వద్దు అంటూ టీమిండియా జట్టులోని 10 మంది సభ్యులు ముక్తకంఠంతో వ్యతిరేకత తెలుపుతుండటంతో బీసీసీఐకి ఏం చేయాలో తోచడం లేదని తెలుస

వరుస విజయాల జట్టు.. కోచ్ మాకొద్దంటోంది.. కుంబ్లేకు గడ్డుకాలం
హైదరాబాద్ , గురువారం, 8 జూన్ 2017 (02:26 IST)
బీసీసీఐకి ఈ తలనొప్పి ఇంతట్లో తగ్గేటట్టు లేదు. టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లేపై బీసీసీఐకి అపార గౌరవం ఉన్నప్పటికీ కుంబ్లే మాకు వద్దే వద్దు అంటూ టీమిండియా జట్టులోని 10 మంది సభ్యులు ముక్తకంఠంతో వ్యతిరేకత తెలుపుతుండటంతో బీసీసీఐకి ఏం చేయాలో తోచడం లేదని తెలుస్తోంది. క్రికెట్‌ సలహా మండలి సభ్యులు సచిన్, లక్ష్మణ్, గంగూలీ ముగ్గురికీ కూడా కుంబ్లేపై సదభిప్రాయం ఉన్నప్పటికే వరుసవిజయాలతో ఊపు మీదున్న జట్టులో పది మంది సభ్యులు ఈ కోచ్ మాకు వద్దు అని తిరస్కరించడంతో కుంబ్లే మళ్లీ కోచ్ అయ్యేందుకు దారులు మూసుకుపోయినట్లే భావిస్తున్నారు.
 
ఆటగాళ్లతో ప్రస్తుత కోచ్‌ అనిల్‌ కుంబ్లే కఠినంగా వ్యవహరిస్తున్నాడని కుంబ్లేను కోచ్‌ గా ఏ మాత్రం ఒప్పుకోమని పది మంది భారత క్రికెటర్లు బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కెప్టెన్‌ కోహ్లీతో సహా కొందరూ ఆటగాళ్లు  జట్టు సభ్యల పట్ల కుంబ్లే కఠినంగా వ్యవహరిస్తున్నాడని అతనితో అసౌకర్యంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
గతేడాది జులైలో మాజీ క్రికెటర్‌ రవిశాస్త్రీతో పోటిపడి అనిల్‌ కుంబ్లే కోచ్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. కుంబ్లే కోచ్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత వెస్టిండీస్‌ పర్యటన నుంచి ఇప్పటి వరకు  భారత్‌  ఏ ఒక్క సిరీస్‌ ఓడిపోలేదు. దీంతో ఈ నెల 20న ముగియనున్న కుంబ్లే పదవి కాలాన్ని 2019 వరల్డ్‌ కప్‌ వరకు పొడిగిస్తారని అందరూ భావించారు. కానీ ఆటగాళ్లకు కుంబ్లే మధ్య విభేదాలు తలెత్తడంతో బీసీసీఐ కోచ్‌ పదవికి దరఖాస్తులు ఆహ్వనించింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ భీకర అటాకింగ్ ముందు చిన్నబోయాను.. కోహ్లీ నిజాయితీకి జోహార్లు