Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రత్యర్థిని తేలిగ్గా చూడకున్నా తప్పని పరాజయం.. బౌలర్లు తేలిపోవడంతో భారత్‌పై శ్రీలంక అద్భుత విజయం

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో మహాద్భుతం... టీమిండియాపై శ్రీలంక గెలుపు. బలమైన ప్రత్యర్థి భారత్ విధించిన భారీ లక్ష్యాన్ని ఏమాత్రం లెక్కపెట్టకుండా విజయమే పరమావధిగా భావించి సర్వ శక్తులు కూడగట్టుకున్న శ్రీలంక అజేయమైన భారత్ బౌలింగును తుత్తునియలు చేసింది. ఛాం

Advertiesment
Mendis
hyderabad , శుక్రవారం, 9 జూన్ 2017 (02:27 IST)
ఐసీసీ చాంపియన్స్  ట్రోఫీలో మహాద్భుతం... టీమిండియాపై శ్రీలంక గెలుపు. బలమైన ప్రత్యర్థి భారత్ విధించిన భారీ లక్ష్యాన్ని ఏమాత్రం లెక్కపెట్టకుండా విజయమే పరమావధిగా భావించి సర్వ శక్తులు కూడగట్టుకున్న శ్రీలంక అజేయమైన భారత్ బౌలింగును తుత్తునియలు చేసింది.  ఛాంపియన్‌ ట్రోఫిలో గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ చివర వరకు పోరాడి ఓడిపోయింది. టాస్‌ ఓడిపోయి మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ ఇండియా నిర్ణీత 50 ఓవర్లో 321పరుగులు చేసింది. మరోసారి రోహిత్‌ శర్మ- శిఖర్‌ ధావన్‌లు తమ బ్యాట్‌తో మెరిపించి వంద పరుగుల బాగస్యామ్యాన్ని నాలుగోసారి సాధించారు. శిఖర్‌ ధావన్‌ 125 పరుగులు చేశాడు. చివరలో ధోనీ మెరుపు బ్యాటింగ్, కేదార్ జాదవ్ దూకుడు కారణంగా 321 పరుగుల భారీ స్కోరు సాధించిన భారత్, తన ప్రత్యర్థి తప్పుగా అంచనా వేసింది. అక్కడే భారత్ విజయానికి దూరమైందని కూడా చెప్పాలి. 
 
322 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినా శ్రీలంక ఆరంభంలోనే ఓపెనర్‌ డిక్వెల్(7) వికెట్‌ను కోల్పోయింది. కుశాల్‌ మెండీస్‌(89), గుణతిలకలు(76)లు నిలకడగా ఆడి  విజయంవైపు అడుగులు పడేలా చేశారు. టీమ్‌ ఇండియాకు బలం అనుకున్న బౌలింగ్‌ విఫలం​తో మ్యాచ్‌ చేయి జారిపోయింది. అంచనాలకు మించి బౌలర్స్‌ తమ ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయారు. మ్యాథూస్‌(52) గుణరత్నే(34)లు చివరి వరకు నిలకడగా ఆడి 48.4 ఓవరల్లో 322 విజయ లక్ష్యాన్ని పూర్తి చేశారు. శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో  ఇండియాపై విజయం సాధించింది.
 
ఛాంపియన్‌ ట్రోఫిలో భారత్‌ గురువారం శ్రీలంకతో జరిగినా మ్యాచ్‌లో చివర వరకు పోరాడి ఓడిపోయింది. టాస్‌ ఓడిపోయి మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ ఇండియా నిర్ణీత 50 ఓవర్లో 321పరుగులు చేసింది. మరోసారి రోహిత్‌ శర్మ- శిఖర్‌ ధావన్‌లు తమ బ్యాట్‌తో మెరిపించి వంద పరుగుల బాగస్యామ్యాన్ని నాలుగోసారి సాధించారు. శిఖర్‌ ధావన్‌ 125 పరుగులు చేశాడు. 322 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినా శ్రీలంక ఆరంభంలోనే ఓపెనర్‌ డిక్వెల్(7) వికెట్‌ను కోల్పోయింది.
 
వాళ్లు తమ ఫామ్‌ను పూర్తిగా కోల్పోయిన స్థితిలో టోర్నీకి వచ్చారు. ఆ జట్టులోని ఇద్దరు ప్లేయర్లను జట్టు కూర్పులో భాగంగా పక్కన పెట్టారు. కీలకమైన ఇన్నింగ్స్‌లో వారి నంబర్ ఫోర్ బ్యాట్స్‌మన్ గాయపడ్డాడు. కానీ ఇవేవీ ఆ జట్టును నిలువరించలేకపోయాయి. కీలకమైన టోర్నీలో మ్యాజిక్‌ను ప్రదర్శించే తమ పోరాటతత్వంలో వారొచ్చారు. ప్రత్యర్థిపై భీకర దాడి చేశారు. ప్రత్యర్థికే కాదు కోట్లాది ప్రత్యర్థి జట్టు అభిమానులను తీవ్ర నిరాశలో పెడుతూ భారత్‌ను ఓడించారు.
 
శ్రీలంక సాధించిన చిరస్మరణీయ విజయానికి కారణం జట్టులోకి నూతన తరం బ్యాట్స్‌మెన్‌ల రాక. కొత్తవాడైన కుశాల్ మెండిస్ తన యవ్వన జీవిత దూకుడును రంగరించిపోసి 89 పరుగులు చేసి భారత బౌలర్లను ఆడుకున్నాడు. ఇక తన కెరీర్ మొత్తం మీద 20 వన్డేలు కూడా ఆడని ధనుష్క గుణతిలక 72 బంతులకు 76 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ తో జట్టును గెలుపువాకిట ఉంచాడు. ఇక మిడిల్ ఓవర్లలో కుశాల్ పెరీరా బ్యాంటింగుతో అదరగొట్టాడు.  టీమిండియా తడబడిన చోటే శ్రీలంక జట్టు బలమైన ప్రత్యర్థిని చితక గొట్టింది. ఇక చివరి ఓవర్లలో కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్.. అశలా గుణరత్నా మద్దతుతో ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే జట్టుకు చిరస్మరణీమైన విజయం సాధించిపెట్టాడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోచ్ రాక్షసుడిలా ప్రవర్తిస్తాడన్న క్రికెటర్లు.. కోచ్ కఠినంగా లేకపోతే గోవిందా.. వెనకేసుకొచ్చిన రవిశాస్త్రి