Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోచ్ రాక్షసుడిలా ప్రవర్తిస్తాడన్న క్రికెటర్లు.. కోచ్ కఠినంగా లేకపోతే గోవిందా.. వెనకేసుకొచ్చిన రవిశాస్త్రి

టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లేపై రోజు రోజుకు ఆరోపణలు పుట్టుకొస్తున్నాయి. కుంబ్లే పదవీ కాలం జూన్ 20తో ముగియనున్న నేపథ్యంలో కొత్త వ్యక్తిని తీసుకోవాలా.. కుంబ్లేనే కొనసాగించాలా.. అనే దానిపై బీసీసీఐ

Advertiesment
Reports
, గురువారం, 8 జూన్ 2017 (13:33 IST)
టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లేపై రోజు రోజుకు ఆరోపణలు పుట్టుకొస్తున్నాయి. కుంబ్లే పదవీ కాలం జూన్ 20తో ముగియనున్న నేపథ్యంలో కొత్త వ్యక్తిని తీసుకోవాలా.. కుంబ్లేనే కొనసాగించాలా..  అనే దానిపై  బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. కొత్త కోచ్ ఎంపికకు నోటిఫికేషన్ జారీ చేసిన బీసీసీఐ, జట్టు సభ్యుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరి, జట్టు మేనేజర్‌ ఎంవీ శ్రీధర్‌, క్రికెట్‌ సలహా మండలి సభ్యుడు గంగూలీ పలు దఫాలుగా సమావేశమయ్యారు. 
 
ప్రాక్టీస్ సెషన్ ఎగ్గొట్టడాన్ని ఏమాత్రం కుంబ్లే ఏమాత్రం సహించబోడని క్రికెటర్లు కుంబ్లేపై ఆరోపణలు చేశారు. ప్రాక్టీస్‌లో దెబ్బలు తగిలినా పట్టించుకోడని, ప్రాక్టీస్ చేయాల్సిందేనని చెబుతాడని, ఆ సమయంలో మానవత్వం మరచి, రాక్షసుడిలా వ్యవహరిస్తాడని ఫిర్యాదు చేశారు. సుమారు 10 మంది ఆటగాళ్లు ఇదే రకమైన ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.
 
రవిశాస్త్రి అలా కాదని, ఆటగాళ్లతో స్నేహంగా, సరదాగా ఉండేవాడని చెప్తున్నారు. దీనిపై సీనియర్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. కుంబ్లే అలా ఉండడం వల్లే జట్టు విజయాల పరంపర కొనసాగిస్తోందని, జట్టుపట్ల కోచ్ కఠినంగా ఉండాల్సి ఉంటుందని, అలా ఉంటేనే సానుకూల ఫలితాలు వస్తాయని, లేని పక్షంలో జట్టు పరాజయాల బాటపట్టే ప్రమాదం ఉందంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పుడేమో కాశ్మీర్ కావాలన్నారు.. ఇప్పుడేమో కోహ్లీ కావాలా? ఎప్పటికీ ''కే'' సొంతం కాదు..