Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విండీస్ వెన్ను విరిచిన షమీ.. విజయానికి అతి చేరువలో టీమిండియా

రెండేళ్లుగా అతను జట్టులో చోటు కోల్పోయాడు. 2015 వన్డే ప్రపంచ కప్ అనంతరం వెస్టిండీస్‌తో సీరిస్‌లో నాలుగో మ్యాచ్‌లో టీమిండియాలో అడుగుపెట్టినప్పటికీ వికెట్ తీయలేకపోయాడు. కాని గురువారం చివరి వన్డేలో మాత్రం చెలరేగిపోయాడు. విండీస్ మిడిలార్డర్‌ను వణికించాడు.

Advertiesment
Shami
హైదరాబాద్ , శుక్రవారం, 7 జులై 2017 (02:05 IST)
రెండేళ్లుగా అతను జట్టులో చోటు కోల్పోయాడు. 2015 వన్డే ప్రపంచ కప్ అనంతరం వెస్టిండీస్‌తో సీరిస్‌లో నాలుగో మ్యాచ్‌లో టీమిండియాలో అడుగుపెట్టినప్పటికీ వికెట్ తీయలేకపోయాడు. కాని గురువారం చివరి వన్డేలో మాత్రం చెలరేగిపోయాడు. విండీస్ మిడిలార్డర్‌ను వణికించాడు. అతడి బౌలింగ్ పటిమ కారణంగా విండీస్ మళ్లీ 50 ఓవర్లలో 9 వికెట్లకు 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. 48 పరుగులకు 4 విలువైన వికెట్లు తీసిన భారత పేసర్ మొహమ్మద్ షమీ చివరి మ్యాచ్‌లో హీరో. భారత్‌కు అతి తక్కువ విజయలక్ష్యాన్ని విధించిన విండీస్ జట్టు విజయంపై ఆశలు వదిలేసుకుంది.
 
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు ఓపెనర్లు లూయిస్‌ (9), కైల్‌ హోప్‌ ఓ మాదిరి ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా హోప్‌ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీలతో జోరు కనబరిచాడు. ఉమేశ్, షమీ బౌలింగ్‌ను తను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అయితే తొమ్మిదో ఓవర్‌లో లూయిస్‌ను పాండ్యా అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే సిరీస్‌లో తొలిసారిగా పవర్‌ప్లేలో విండీస్‌ 49 పరుగులు సాధించింది. ఆ తర్వాత కూడా జోరు తగ్గించని కైల్‌ హోప్‌.. షమీ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. కానీ 16వ ఓవర్‌లో ఉమేశ్‌ యాదవ్‌ విండీస్‌కు షాక్‌ ఇచ్చాడు. వరుస బంతుల్లో కైల్‌ హోప్, చేజ్‌ను పెవిలియన్‌కు పంపాడు.
 
ఆ తర్వాత స్పిన్నర్లను రంగంలోకి దించడంతో విండీస్‌ పరుగుల వేగం తగ్గగా 10 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. మొహమ్మద్‌ (16)ను కేదార్‌ జాదర్‌ రిటర్న్‌ క్యాచ్‌తో అవుట్‌ చేశాడు. ఈ దశలో షాయ్‌ హోప్, హోల్డర్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. పరిస్థితులకు తగ్గట్టు నిదానంగా ఆడిన షాయ్‌ 94 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. అయితే 40వ ఓవర్‌ నుంచి షమీ అనూహ్యంగా చెలరేగడంతో విండీస్‌ పతనం ప్రారంభమైంది. తన వరుస నాలుగు ఓవర్లలో జోరు మీదున్న హోల్డర్, షాయ్‌ హోప్‌తో పాటు నర్స్, బిషూ వికెట్లకు తీయడంతో విండీస్‌ వణికింది. హోల్డర్, షాయ్‌ హోప్‌ మధ్య ఐదో వికెట్‌కు అత్యధికంగా 48 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. చివర్లో పావెల్‌ కాస్త దూకుడు కనబరచగా స్కోరు 200 దాటింది.
 
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా రహానే, కోహ్లీ, దినేష్ అద్భుత ప్రదర్శనతో విజయానికి దాదాపుగా చేరువలోకి వచ్చింది. కోహ్లీ సెంచరీకి చేరువకాగా, దినేష్ అర్ధ సెంచరీ బాటలో ఉన్నాడు. భారత్ మరో అద్భుత విజయానికి సమీపంలో ఉంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిషా వద్దు.. మంధననే ముద్దు.. క్రికెట్ సౌందర్యరాశికి కుర్రకారు ఫిదా