Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దిషా వద్దు.. మంధననే ముద్దు.. క్రికెట్ సౌందర్యరాశికి కుర్రకారు ఫిదా

ఒక చిన్నమ్మాయి. సెలెబ్రటీ కాదు. బాలీవుడ్ హీరోయిన్ అసలే కాదు. బికినీతో, మోడ్రస్ డ్రెస్‌తో గ్లామర్ షోలలో చర్మ ప్రదర్శనతో మెరిసే ముద్దుగుమ్మ కానేకాదు. కానీ భారత్ యువతకు ఇప్పుడు ఆమే ఒక జగదేకసుందరి. టీమిండియా మహిళా జట్టు ఓడిపోయినా ఫర్వాలేదు. ఆమె పరుగులు త

Advertiesment
దిషా వద్దు.. మంధననే ముద్దు.. క్రికెట్ సౌందర్యరాశికి కుర్రకారు ఫిదా
హైదరాబాద్ , శుక్రవారం, 7 జులై 2017 (01:28 IST)
ఒక చిన్నమ్మాయి. సెలెబ్రటీ కాదు. బాలీవుడ్ హీరోయిన్ అసలే కాదు. బికినీతో, మోడ్రస్ డ్రెస్‌తో గ్లామర్ షోలలో చర్మ ప్రదర్శనతో మెరిసే ముద్దుగుమ్మ కానేకాదు. కానీ భారత్ యువతకు ఇప్పుడు ఆమే ఒక జగదేకసుందరి. టీమిండియా మహిళా జట్టు ఓడిపోయినా ఫర్వాలేదు. ఆమె పరుగులు తీయకపోయినా ఫర్వాలేదు. ఒక్క చిరునవ్వు.. మైదానంలో హాయిగా, ఆహ్లాదంగా, చల్లగా ఒక్క చిరునవ్వు నవ్వితే చాలు డబుల్ సెంచరీ కొట్టినంత ఆనందం మాకు అంటూ మైమర్చిపోతున్నారు. నీ ముందు బాలీవుడ్ మాస్ హీరోయిన్ దిషా పటాని ఎంత ఆఫ్టరాల్ అంటూ బాలీవుడ్ గ్లామర్ క్వీన్‌ని కూడా తోసి పడేస్తున్నారు. కోట్లమంది క్రికెట్ అభిమానులను ఇంతగా ఊపేస్తున్న ఆమె ఎవరు?
 
ఆమె పేరు స్మృతి మంథన. ఇంగ్లండ్‍లో జరుగుతున్న మహిళల వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లను అభిమానులు క్రమం తప్పకుండా చూస్తున్నారట. అందులోనూ భారత్ ఆడే మ్యాచ్‌లను అస్సలు మిస్ కావడం లేదట. అంటే, మన మహిళా క్రికెట్ కు మంచి రోజులు వచ్చినట్లే అనుకుంటున్నారా. అయితే ఇక్కడ మీరు పొరబడినట్లే. ఆ మ్యాచ్‌లను  చూసేది భారత మహిళా ఓపెనర్ స్మృతి మంధనా కోసమట. వన్డే వరల్డ్ కప్ లో ప్రత్యర్థి జట్లకు కొరకరాని కొయ్యగా తయారైన మంధనకు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. 
 
భారత జట్టు మ్యాచ్ గెలిచినా, గెలవకపోయినా.. ఆమె కనిపించి ఒక నవ్వు నవ్వితే చాలు డబుల్ సెంచరీ కొట్టినంత ఆనందంగా ఉందని అంటున్నారు అభిమానులు.. ప్రస్తుతం కుర్రకారు అమితంగా ఇష్టపడే జాబితాలో మంధనకు కూడా చేరిపోయింది. ఇక్కడ సోషల్ మీడియాలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ నటి దిషా పటానిని సైతం మంధన అధిగమించేసింది. ఇప్పటి వరకూ దిషా పటాని హాట్ లుక్స్‌కు ఫిదా అయిపోయిన ఫ్యాన్స్.. మంధన అమాయకపు చూపులకు తమను తాము మైమరిచిపోతున్నారు. 
 
మరికొంతమందైతే అసలు దిషా పటానికి, మంధనకు పోలికా లేదని తేల్చిపారేస్తున్నారు. 'నాకు దిషా వద్దు.. మంధననే ముద్దు' అనేంతగా ఊహల్లో ఊరిగేపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మహిళా వన్డే వరల్డ్ కప్‌లో తన పవర్ ఫుల్ బ్యాటింగ్‌తో మంధన ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ లో 90 పరుగులు చేయగా, వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో అజేయంగా 106 పరుగులు చేసి విజయాల్లో కీలక పాత్ర పోషించింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'నేను మతిలేకుండా ఆడుతున్నా' : విశ్వనాథ్ ఆనంద్