Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారీ లక్ష్య ఛేదనలో భారత్‌కు పిడుగుపాటు.. 33 పరుగులకే రోహిత్, కోహ్లీ. ధావన్ ఔట్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం లండన్‌లో జరుగుతున్న ఫైనల్ పోటీలో భారత్‌ పిడుగుపాటుకు గురైంది. 339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన బారత్ తొలి ఓవర్లోనే రోహిత్‌ వికెట్, మూడో ఓవర్లో కెప్టెన్ కోహ్లీ వికెట్‌ను కోల్పోయి కో్ట్లాది అభిమానులకు షాక్ కలిగిం

Advertiesment
భారీ లక్ష్య ఛేదనలో భారత్‌కు పిడుగుపాటు.. 33 పరుగులకే  రోహిత్, కోహ్లీ. ధావన్ ఔట్
హైదరాబాద్ , ఆదివారం, 18 జూన్ 2017 (20:00 IST)
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం లండన్‌లో జరుగుతున్న ఫైనల్ పోటీలో భారత్‌ పిడుగుపాటుకు గురైంది. 339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన బారత్ తొలి ఓవర్లోనే రోహిత్‌ వికెట్, మూడో ఓవర్లో కెప్టెన్ కోహ్లీ వికెట్‌ను కోల్పోయి కో్ట్లాది అభిమానులకు షాక్ కలిగించింది. పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ అమీర్ వరుస ఓవర్లలో కీలక వికెట్లు తీసి భారత్ నడ్డి విరిచాడు. తొమ్మిదో ఓవర్లో అమీర్ శిఖర్ ధావన్‌ను ఔట్ చేసి భారత్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. 10 ఓవర్లలో 47 పరుగులు చేసిన భారత్ చిరకాల ప్రత్యర్థితో పోరులో తొలిసారి ఒత్తిడికి గురవుతోంది. భారమంతా యువరాజ్, ధోనీపైనే ఉండటంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోయింది.
 
ఐసీసీ చాంపియన్స్ ట్రోపీలో భారీ లక్ష్యాలను అలవోకగా ఛేదించిన టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాక్‌తో పైనల్‌లో చేతులారా ప్రత్యర్థికి భారీ రన్ రేట్‌ను అందించింది. డెత్ బౌలర్‌గా తిరుగులేని విజయాలను అందించిన బూమ్రా పాక్ బ్యాట్స్‌మన్ ఫకర్ జమాన్‌ను రెండో ఓవర్లోనే ఔట్ చేసినప్పటికీ నోబాల్ ద్వారా జమాన్‍‌కు జీవం పోశాడు. కీలకమ్యాచ్‌లో జీవన దానం పొందిన జమాన్ అద్భుత సెంచరీతో పాక్‌ను ఆదుకున్నాడు. భారత్ స్పిన్నర ద్వయం అశ్విన్, జడేజా ఘోర వైపల్యం కూడా పాక్‌కు బారీ ఆధిక్యతను ఇవ్వడంతో తోడ్పడింది. 
 
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం లండన్‌లో భారత్‌తో జరుగుతున్న టైటిల్ పోరులో పాకిస్తాన్ 339 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పాకిస్తాన్ ఓపెనర్లు ఫకార్ జమాన్(114;106బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు), అజహర్ అలీ(59;71బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్)లతో పాటు బాబర్ అజమ్(46;52 బంతుల్లో 4 ఫోర్లు), మొహ్మద్ హఫీజ్(57 నాటౌట్;37 బంతుల్లో 4 ఫోర్లు ,3 సిక్సర్లు) లు మెరిసి జట్టు భారీ స్కోరుకు తోడ్పడ్డారు.
 
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ కు ఓపెనర్లు జమాన్, అజహర్ అలీలు శుభారంభం అందించారు.  ఈ జోడి తొలి వికెట్ కు 128 పరుగులు చేసి జట్టును పటిష్ట స్థితికి చేర్చింది. ఈ క్రమంలోనే ముందు అజహర్ అలీ హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై జమాన్ అర్థ శతకం నమోదు చేశాడు. అయితే ఆపై వీరిద్దరూ మరింత దూకుడుగా ఆడే క్రమంలో అలీ తొలి వికెట్ గా వెనుదిరిగాడు. ఆపై జమాన్ కు జత కలిసిన ఫస్ట్ డౌన్ ఆటగాడు బాబర్ అజమ్ సమయోచితంగా ఆడాడు. ఈ క్రమంలోనే బాబర్-జమాన్ లు జోడి72 పరుగులు జత చేసింది. దాంతో పాకిస్తాన్ 33.1 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది.
 
అటు తరువాత పాకిస్తాన్ వెటరన్ ఆటగాడు షోయబ్ మాలిక్(12)నిరాశపరిచినప్పటికీ, బాబర్ అజమ్ మాత్రం నిలకడగా ఆడాడు. అయితే హాఫ్ సెంచరీకి కొ్ద్ది దూరంలో నాల్గో వికెట్ గా అజమ్ అవుటయ్యాడు. కాగా, ఆపై మొహ్మద్ హఫీజ్ సైతం చెలరేగి ఆడటంతో పాకిస్తాన్ జట్టు మూడొందల మార్కును అవలీలగా దాటింది. ఇమాద్ వసీం(25 నాటౌట్; 21 బంతుల్లో 1 ఫోర్, 1సిక్సర్) తో కలిసి  71 పరుగులు జత చేయడంతో పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా, కేదర్ జాదవ్ చెరొక వికెట్ తీశారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్