ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్
తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్‌లో విజేతగా నిలిచాడు. జకార్తాలో జరిగిన ఈ ఓపెన్ సిరీస్ ఫైనల్లో జపాన్ ఆటగాడు కజుమాసా సకాయ్‌తో శ్రీకాంత్ తలపడ్డాడు. వరుస రెండ
తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్‌లో విజేతగా నిలిచాడు. జకార్తాలో జరిగిన ఈ ఓపెన్ సిరీస్ ఫైనల్లో జపాన్ ఆటగాడు కజుమాసా సకాయ్‌తో శ్రీకాంత్ తలపడ్డాడు. వరుస రెండు సెట్లలో కిడాంబి అదరగొట్టాడు.
ప్రత్యర్థిపై ఆద్యంతం మెరుగైన ఆటతీరుతో కట్టడి చేశాడు. తొలి సెట్ ను 21-11తో కైవసం చేసుకున్న శ్రీకాంత్, రెండో సెట్‌ను సొంతం చేసుకునేందుకు కొంచెం శ్రమించాడు. ఆపై సుకాయ్‌పై విజృంభించిన శ్రీకాంత్.. రెండో సెంట్‌ను 21-19తో గెలిచి సూపర్ సిరీస్‌ను సాధించాడు.
అంతకుముందు పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ నెంబర్ వన్ సాన్ వాన్ హొ(కొరియా)ను కిడాంబి ఓడించి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నాడు. 21-15, 14-21, 24-22 తేడాతో గెలుపొందాడు.