Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధోనీని ఇలా ఎన్నడైనా చూశామా? ‘ఎక్స్‌పైరీ డేట్‌’కు చేరువైనట్లేనా?

ఓటమి తప్పదనిపించిన మ్యాచ్‌లను విజయాలతో ముగించడంతో అల్లుకుపోయిన పేరు తనది. అతనుంటే చాలు ఎలాంటి మ్యాచ్ అయినా సరే భారత్‌కు విజయం ఖాయం అనిపించడమే కాదు ఎన్నో సందర్భాల్లో నిరూపించిన దూకుడు తనది. ముఖ్యంగా చివరి ఓవర్లలో ఒక విద్వంసాన్ని కూడా కూల్‌గా సృష్టించి

ధోనీని ఇలా ఎన్నడైనా చూశామా? ‘ఎక్స్‌పైరీ డేట్‌’కు చేరువైనట్లేనా?
హైదరాబాద్ , మంగళవారం, 4 జులై 2017 (01:51 IST)
ఓటమి తప్పదనిపించిన మ్యాచ్‌లను విజయాలతో ముగించడంతో అల్లుకుపోయిన పేరు తనది. అతనుంటే చాలు ఎలాంటి మ్యాచ్ అయినా సరే భారత్‌కు విజయం ఖాయం అనిపించడమే కాదు ఎన్నో సందర్భాల్లో నిరూపించిన దూకుడు తనది. ముఖ్యంగా చివరి ఓవర్లలో ఒక విద్వంసాన్ని కూడా కూల్‌గా సృష్టించి మరీ ఇలా ఆడి గెలవాలి అని ప్రపంచానికి నిరూపించిన ఘనమైన ప్రాభవం తనది. భారత్ తరపున చివరి ఓవర్లలో చిరస్మరణీయ విజయాలను అందించిన ఆ స్థతి ప్రజ్ఞుడికి ఏమైందిప్పుడు. కోట్లాదిమంది అభిమానులను తొలిచివేస్తున్న, కలచి వేస్తున్న ప్రశ్న ఇది. 
 
వెస్టిండీస్‌తో ప్రస్తుత సీరిస్‌లో ఆదివారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో కళ్లముందు దోబూచులాడిన విజయాన్ని అందించినట్లే అందించి చివరి క్షణాల్లో చేజార్చుకోవడం ఒక్క ధోనీ బాధ్యతేనా అంటే అవుననలేం కానీ ఇలాంటి ఎన్నో సంక్లిష్ట భరిత క్షణాల్లో విజయాన్ని తిప్పేసిన బ్యాట్ తనది. ముఖంలో ఎలాంటి తడబాటు కనిపించకుండా ప్రత్యర్థిని లేపేసే ఆ వ్యక్తి ఇప్పుడు చరమాంకంలో విపరీతంగా బాధపడటం అభిమానులను కదిలించివేస్తోంది. కెప్టెన్సీని జారవిడ్చుకోవాల్సిన అవసరం లేని క్షణాల్లో కూడా అనూహ్యంగా తప్పుకుని ఆటగాడిగా మిగిలిన ఈ ఘనమైన ఆటగాడు తన చివరి అంకాన్ని కూడా అలాగే ముగించనున్నాడా?
 
గతంలో ఇదే వెస్టిండీస్‌ గడ్డపై శ్రీలంకతో చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు కావాల్సి ఉండగా మూడే షాట్లు 6, 4, 6తో అతను ముగించాడు. తీవ్ర ఒత్తిడితో ఉండే చివరి ఓవర్లలో మరో బ్యాట్స్‌మన్‌ను కూడా నమ్మకుండా తనపైనే నమ్మకముంచడం అతని ఆత్మవిశ్వాసానికి సంకేతంగా కనిపించేది. దాదాపు మూడేళ్ల క్రితం ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అంబటి రాయుడుకు స్ట్రైకింగ్‌ నిరాకరించిన ఘటన దీనికి చక్కటి ఉదాహరణ. పై మ్యాచ్‌లను చూస్తే ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికాపై 11 పరుగులు (బౌలర్‌ రబడ), జింబాబ్వేపై 8 పరుగులు (మద్‌జివా), విండీస్‌పై 8 పరుగులు (డ్వేన్‌ బ్రేవో) చేయడంలో ధోని విఫలమయ్యాడు.
 
103 బంతులు ఆడితే గానీ ఒక ఫోర్‌ కొట్టలేని,108 బంతులకు గానీ అర్ధ సెంచరీ చేయలేని ధోనిని ఎప్పుడైనా చూశామా రెండో మ్యాచ్‌ ఆడుతున్న అనామకుడు కెస్‌రిక్‌ విలియమ్స్‌ 22 బంతుల్లో ధోనిని సింగిల్‌ కూడా తీయకుండా ఆపడమేంటి పేరు లేని ఇద్దరు స్పిన్నర్లు కలిపి వేసిన 68 బంతుల్లో ధోని 28 పరుగులు మాత్రమే చేయడమేంటి దూకుడుకు మారుపేరైన ధోని స్వీప్‌ షాట్‌తో పరుగులు రాబట్టాలని ప్రయత్నించడం ఎప్పుడైనా గుర్తుందా? కానీ పేలవ షాట్‌కు ప్రయత్నించి అతను వెనుదిరిగడంతో చివరి ఓవర్లో చేసేందుకు ఏమీ లేకపోయింది. తక్కువ వ్యవధిలో కేదార్‌ జాదవ్, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా అవుటైన తర్వాత కూడా ధోని బ్యాటింగ్‌లో దూకుడు పెంచలేకపోయాడు. 
 
స్వల్ప ఛేదనలో జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా విఫలమైనప్పుడు ధోనినే తప్పు పట్టడం సరైంది కాదనిపిస్తుంది. కానీ ఇలాంటి మ్యాచ్‌ల విజయాలతోనే తన పేరు అల్లుకుపోయి ఉందని... ఇది తాను కచ్చితంగా ఫినిష్‌ చేయాల్సిన మ్యాచ్‌ అని ధోనికి కూడా తెలుసు. అదే బాధ అతనిలో మ్యాచ్‌ తర్వాత కనిపించింది. చివరి వరకు ఉంటే చాలు నేను గెలిపించగలననేది ధోని తరచుగా చెప్పే మాట. కానీ ఈ మ్యాచ్‌లో ఆ నమ్మకం పని చేయలేదు. గెలిపించలేకపోయిన గత మ్యాచ్‌లలో ధోని చివర్లోనే బ్యాటింగ్‌కు వచ్చి ధనాధన్‌గా ముగించాల్సిన పరిస్థితిలో ఆడాడు. 
 
కానీ నాలుగో వన్డేలో అతను 13వ ఓవర్లోనే బ్యాటింగ్‌కు వచ్చాడు. చాలా సేపు క్రీజ్‌లో గడిపిన తర్వాత కూడా పరిస్థితిని బట్టి ఆడలేకపోవడం అతని వైఫల్యాన్ని చూపిస్తోంది. ఈ విషయంలో పిచ్‌ను కూడా తప్పు పట్టలేం. గత మ్యాచ్‌లో ఇంతకంటే కఠినమైన వికెట్‌పై ధోని 78 పరుగులు సాధించాడు. ఆ మ్యాచ్‌లో అతను ఎంతో స్వేచ్ఛగా ఆడాడు. ధోని అనుభవాన్ని బట్టి చూస్తే 49వ ఓవర్‌ చివరి బంతికి సింగిల్‌ తీసి స్ట్రైకింగ్‌ కాపాడుకుంటారని అంతా భావించారు.
 
కానీ పేలవ షాట్‌కు ప్రయత్నించి అతను వెనుదిరిగడంతో చివరి ఓవర్లో చేసేందుకు ఏమీ లేకపోయింది. తక్కువ వ్యవధిలో కేదార్‌ జాదవ్, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా అవుటైన తర్వాత కూడా ధోని బ్యాటింగ్‌లో దూకుడు పెంచలేకపోయాడు. స్వల్ప ఛేదనలో జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా విఫలమైనప్పుడు ధోనినే తప్పు పట్టడం సరైంది కాదనిపిస్తుంది. కానీ ఇలాంటి మ్యాచ్‌ల విజయాలతోనే తన పేరు అల్లుకుపోయి ఉందని... ఇది తాను కచ్చితంగా ఫినిష్‌ చేయాల్సిన మ్యాచ్‌ అని ధోనికి కూడా తెలుసు. అదే బాధ అతనిలో మ్యాచ్‌ తర్వాత కనిపించింది. చివరి వరకు ఉంటే చాలు నేను గెలిపించగలననేది ధోని తరచుగా చెప్పే మాట. కానీ ఈ మ్యాచ్‌లో ఆ నమ్మకం పని చేయలేదు.
 
వయసుతో పాటు వన్నె పెరిగే వైన్‌లాంటివాడినని చెప్పుకున్న ధోని ఆట అనూహ్యం. మూత తీసిన వైన్‌లా అతనూ ‘ఎక్స్‌పైరీ డేట్‌’కు చేరువయ్యాడా అనే సందేహాలు ఈ ఇన్నింగ్స్‌ రేకెత్తించింది.  ఏదేమైనా ఒకటి నిజం. తనకు పొగబెట్టి సాగనంపేవరకు జట్టును అంటిపెట్టుకుని ఉండటం ధోనీ లక్షణం కానే కాదు. మరి ఇప్పుడు అతడి నుంచి మరొక చివరి నిర్ణయం త్వరలో రాబోతోందా?
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఫార్ములా త్రీ కార్ రేసింగ్‌...